మీ వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయి! రేణు షాకింగ్ కామెంట్స్!

ఒక్కోసారి మనం సరదాకి చేసే పనులు అనుకోని విషాదాలకి కారణం అవుతూ ఉంటాయి. మన చేసిన పని వల్ల ఇంత పెద్ద నష్టం జరిగిందా అని తరువాత బాధ పడుతూ ఉంటాము. ఇప్పుడు ఫ్యాన్స్ చేస్తున్న ఓ చిన్న తప్పు కూడా.. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయా అంటే అవుననే అంటుంది మాజీ హీరోయిన్ రేణు దేశాయ్. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కష్ట సమయాన్ని ఎంత మంది దాటుకుని బయట పడతారో కూడా అర్ధం కాని పరిస్థితిలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ చేసిన కొన్ని కామెంట్స్ అందరిని ఆలోచనలో పడేశాయి. మనలో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాము. ఇందులో మన ఫేవరేట్ యాక్టర్స్ కి కామెంట్స్ మీద కామెంట్స్ పెట్టేస్తుంటాము. కొంత మంది నెటిజన్స్ అయితే వారికి పర్సనల్ గా మెసేజ్ లు చేస్తూ ఉంటారు. కానీ.., మామూలు సమయంలో అయితే దీన్ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోరు. కానీ.., ఇలాంటి క్లిష్ట స్థితిలో ఎప్పుడు, ఎవరిని సహాయం అడగాల్సి వస్తుందో అర్ధం కావడం లేదు.

renu 2

ఇప్పటికే కొంత మంది స్టార్స్ తమకి తోచిన సహాయం చేస్తూ వస్తున్నారు. వారి సహాయం కోరే ప్రజలు వారికి కామెంట్స్ చేయడమో, పర్సనల్ గా మెసేజ్ చేయడమో చేస్తున్నారు. కానీ.., అసలు ఎలాంటి అవసరం లేకుండా ఆకతాయిలు వీరికి పదే పదే మెసేజ్ లు, కామెంట్స్ చేస్తున్నారు. దీని కారణంగా నిజంగా అవసరంలో ఉన్న వారి రిక్వెస్ట్ లు కనిపించకుండా కిందకి వెళ్లిపోతున్నాయి. ఈ విషయంలోనే రేణు తీవ్రంగా స్పందించింది. హాయ్, హాలో అంటూ మీరు మెసేజ్ లు చేయడం వలన సాయం కోరుతూ పంపిన వాళ్ల మెసేజ్ లు కిందకు వెళ్లిపోతున్నాయి. దీంతో అవి చూడటానికి తనకు వీలు కావడం లేదని తెలిపారు రేణు. సరదా కోసం చేసే పనుల కారణంగా అవతల సరైన సమయంలో సాయం అందక కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని.. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజీలు చేయడం ఆపండి అంటూ ఫైర్ అయ్యింది. ప్రజలకి తాను ఆర్థిక సాయం చేయడంలేదని, కానీ.. అనారోగ్యంతో ఉన్నావారికి ఆసుపత్రులు, మందులు, ఆక్సిజన్ విషయంలో మాత్రమే తన వంతు సాయం చేస్తున్నా అని రేణు చెప్పుకొచ్చింది. అలాంటి వారికి అందే సహాయం మీ కారణంగా ఆగిపోతుంది అంటూ రేణు కాస్త ఘాటుగానే స్పందించింది. మరి.., ఈ విషయంలో రేణు ఆవేదన నిజమే అని మీరు భావిస్తున్నారా ? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.