మెగా ఫ్యామిలీ నుంచి అకిరా నందన్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని ఎప్పటి నుంచో పవన్ కల్యాణ్ అభిమానులే కాదు.. మెగా అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీకి సంబంధించి ఒక అధికారిక ప్రకటన విడుదలైంది.
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు వచ్చారు. వారిని వారు ప్రూవ్ చేసుకుని ఎంతో అభిమానులను సొంతం చేసుకున్నారు. మెగా కాంపౌండ్ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినా.. ఒకరి కోసం మాత్రం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అదే పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ గురించే. అవును.. అకిరా సినిమాల్లోకి వస్తాడా? రాడా? వస్తే ఎప్పుడు వస్తాడు? హీరోగా చేస్తాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు గత కొన్నినెలలుగా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అకిరా సినిమాల్లోకి రాడంటూ తల్లి రేణూ దేశాయ్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. కానీ, సినిమాల్లోకి అకిరా ఎంట్రీ ఇస్తున్నాడు అనే విషయం అధికారికంగా కన్ఫమ్ అయిపోయింది. అందుకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది.
పవన్ కల్యాణ్– రేణూ దేశాయ్ కుమారుడు అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా? లేదా? అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించిన అప్టేడ్ రానే వచ్చింది. అయితే ఇది గుడ్ న్యూస్ అయినా.. మెగా అభిమానులకు ఇందులో ఒకింత బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఎందుకంటే అకిరా సినిమాల్లోకి వస్తున్న విషయం నిజమేగానీ.. హీరోగా రావడం లేదు. అవును.. మ్యూజిక్ డైరెక్టర్ గా అకిరా ఎంట్రీ ఇస్తున్నాడు. అతను చేస్తున్న తొలి సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చింది. అకిరా ‘రైటర్స్ బ్లాక్’ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు.
ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియో రిలీజ్ చేశారు. రైటర్స్ బ్లాక్ నుంచి ఒక రచయిత ఎలా తప్పించుకున్నాడు.. అనే కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కార్తికేయ యార్లగడ్డ రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. అకిరా నందన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ వీడియోకి సంబంధించి అకిరా అందించిన మ్యూజిక్ కచ్చితంగా వ్యూవర్స్ ని ఆకట్టుకునేలా ఉంది. మొదటి నుంచి అకిరా మార్షల్ ఆర్ట్స్ తో పాటుగా.. మ్యూజిక్ కూడా నేర్చుకున్నాడు. ఒకసారి తల్లి రేణూ దేశాయ్ కోసం అకిరా కీ బోర్డ్ ప్లే చేస్తూ సాంగ్ పాడిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.