సినీ కళాకారులకు ప్రకాశ్ రాజ్ విందు..!

ప్రస్తుతం రాష్ట్రాల్లో జరిగే సాధారణ ఎన్నికలను సైతం మరిపించే విధంగా మూవీ అసోసియేషన్ (మా) ఎన్నికల రచ్చ మొదలైంది. త్వరలో జరగబోయే ‘మా’ అధ్యక్ష పదవి కోసం బీభత్సమైన రాజకీయాలు మొదలయ్యాయి. మనమంతా ఒక్కటే.. మన కోసం మనం పోరాడుదాం.. అంతా వసుదైక కుటుంబం అంటూనే ఎవరికి వారే ఎమునాతీరే అన్న చందంగా సాగుతుంది.

maa election min

మా అధ్యక్ష పోటీలో ముందుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్‌లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. అనూహ్యంగా జీవిత ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ప్రత్యక్షం అయ్యారు. దాంతో బండ్ల గణేష్ రంగంలోకి దిగారు జీవిత పై నేను పోటీ చేస్తా అంటూ ఆయన బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే పోటీలో అయిదుగురు కనిపిస్తున్నా.. రెండు ప్యానెల్స్ మధ్య ఈ వార్ జరిగేలా అనిపిస్తుంది. మా అధ్యక్ష ఎన్నికల పోటీ విలక్షన నటుడు ప్రకాశ్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు మద్యనే ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా సినీ పరిశ్రమలోని కార్మికుల సమస్యల గురించి చర్చించేందుకు ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరికీ వాళ్ళు అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టారు. మొన్న మధ్య నరేష్ తన మెంబర్స్ తో ఓ హోటల్ లో కలిసి పార్టీ చేసుకున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా తన ప్యానల్ మెంబర్స్ తో విందు ఏర్పాటు చేశారు. “ప్రియమైన సిని”మా” బిడ్డలకు… కలసి మాట్లాడుకుందాం.. అభిప్రాయాల్ని పంచుకుందాం… ప్రతిష్ఠని, పటిష్టతని పెంచే దిశగా…మన లక్ష్యాలు మాట్లాడుకుందాం… మాట్లాడుకున్నాక సహపంక్తి భోజనం చేద్దాం.. అంటూ ఓ ఆహ్వాన సందేశాన్ని సినీ కళాకారులకు ప్రకాశ్ రాజ్ టీమ్ పంపినట్టు తెలుస్తోంది.