ఆర్ఆర్ఆర్ విడుదలకు మార్గం సుగుమం.. వెనక్కి తగ్గిన గంగుబాయి

RRR Rajamouli Ntr Ram Charan

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక వీళ్లతో పాటు బాలీవుడ్ స్టార్స్ అయిన అజయ్ దేవగణ్, అలియా భట్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఇటు బాలీవుడ్, హాలీవుడ్ తారలు సైతం నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ అంచనాలు మరింత పంచేలా చేస్తున్నాయి. ఇక విషయం ఏంటంటే..? సంజయ్‌లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న బాలీవుడ్ చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్ తో పాటు అలియా భట్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ మూవీ కన్న ఒక్క రోజు ముందు అంటే వచ్చే ఏడాది జనవరి 6న గంగూబాయి విడుదల అవుతుంటే జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.

RRR Rajamouli Ntr Ram Charan

ఇక భారీ బడ్జెట్ తో అటు రాజమౌళి మూవీ ఇటు సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలు ఒక్క రోజుతో పోటీ పడనున్నాయి. దీంతో కలెక్షన్ పరంగా నష్టపోతామని భావిస్తూ ఈ నేపథ్యంలోనే ‘గంగూబాయి కథియావాడి’ చిత్ర యూనిట్ విడుదల తేదిని వాయిదా వేస్తున్నామంటూ ట్విట్టర్ వేదికగా అధికారికంగా తెలిపింది. ఇక పోస్ట్ పోన్ చేస్తూ ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నామని మూవీ యూనిట్ తెలిపింది. వీరి ప్రకటనతో వెంటనే స్పందించిన రాజమౌళి ట్విట్టర్ లో ‘గంగూబాయి కథియావాడి’ విడుదల విషయంలో తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు అంటూ తెలిపారు. ఇక గంగుబాయి వెనక్కి తగ్గటంతో ఆర్ఆర్ఆర్ విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.