ప్రభాస్ ది రాజమౌళి ది డెడ్లీ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛత్రపతి, బహుబలి తో వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. అయితే సినిమాల ద్వారానే కాదు వీరు ప్రమోషన్స్ పరంగా కూడా కలిసిన ఆ కిక్కే వేరనేలా ఉంటుంది. తాజాగా వీరిద్దరూ ఒక సినిమా ప్రమోషన్ లో కలవనున్నారని తెలుస్తుంది. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్, రాజమౌళి ది డెడ్లీ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛత్రపతి, బహుబలి తో వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే బాగుండు అనుకుంటున్నారు. అయితే వీరి కాంబినేషన్ మళ్లీ ఎప్పుడుంటుందో ఎన్నాళ్ళ తర్వాత ఉంటుందో చెప్పలేము గాని మరోసారి వీరిద్దరూ చేతులు కలిపితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. అయితే సినిమాల ద్వారానే కాదు వీరు ప్రమోషన్స్ పరంగా కూడా కలిసిన ఆ కిక్కే వేరనేలా ఉంటుంది. తాజాగా వీరిద్దరూ ఒక సినిమా ప్రమోషన్ లో కలవనున్నారని తెలుస్తుంది. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.
గతంలో రాజమౌళి ప్రభాస్ రాధాశ్యామ్ సినిమా కోసం ప్రమోషన్ లో పాల్గొన్నాడు. జక్కన్న తో ఇంటర్వ్యూ చేస్తూ సందడి చేసాడు ప్రభాస్. అయితే ఈ సారి ఆదిపురుష్ కోసం రాజమౌళిని రంగంలోకి దింపడానికి సిద్దమవుతున్నాడు. జూన్ 15 న సినిమా థియోటర్లన్ని రామమందిరాలుగా మారనున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ ప్రమోషన్స్ పరుగులు పెట్టిస్తున్నారు మూవీ మేకర్స్. .ట్రైలర్ జై శ్రీరామ్ సాంగ్ ను అంచనాలను బారీగా పెంచాయి. ముఖ్యంగా జై శ్రీరామ్ సాంగ్ ను ఆడియెన్స్ కు బూస్ట బామ్స్ గా తెప్పించేస్తుంది. ఈ నెల 29 న సియా రామ్ సాంగ్ ను రీలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జూన్ 6 న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విడుదల చేయబోతున్నారు.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ వేడుకకు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రబాస్ అడిగితే నో చెప్పే ఛాన్స్ లేదు. కాబట్టి ఆదిపురుష్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాజమౌళి నే అనుకుంటున్నారు. అదే జరిగితే ఆదిపురుష్ అంచనాలు ఫీక్స్ కు వెళ్లిపోవడం ఖాయం. అయితే ఈ విషయం పై క్లారిటి రావల్సి ఉంటుంది. ఇక తిరుపతి ఈవెంట్ అయిపోయాక దేశవ్యాప్తంగా మరికొన్ని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు జరపడానికి ప్లాన్ లు చేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన కృతిసనన్ సీత గా నటిస్తుండగా సైఫలీకన్ రావణుడిగా నటిస్తున్నాడు.మొత్తానికి రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్ కోసం వస్తే మీద అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.