ఈ ఫొటోలో ఉన్న పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్! ఎవరో తెలుసా?

గడిచిపోయే క్షణాలు మళ్ళీ తిరిగి రావు. వాటిని గుప్పిట్లో అమాంతం పట్టి బంధించలేము. కానీ.., ఓ చిన్న ఫోటో క్లిక్ మాత్రం ఆ క్షణాలను పదిలం చేయగలదు. ఇందుకే మన చిన్ననాటి ఫోటోలు ఎప్పుడైనా కనిపిస్తే మైమరచిపోయి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంటాము. ఇక ఇలాంటి త్రో బ్యాక్ పిక్స్ మన స్టార్ హీరోలు, హీరోయిన్స్ దగ్గర చాలానే ఉంటాయి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఒక్కోసారి ఆ పిక్స్ ని ఫ్యాన్స్ గూగుల్ లో శోధించి మరీ బయటకి తీస్తుంటారు. ఇంకొన్ని సార్లు మాత్రం ఆయా స్టార్స్ సరదాగా ఆ త్రో బ్యాక్ పిక్స్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా తన చిన్ననాటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ కావడం ఎవరు ఈ పాప అంటూ నెటిజన్స్ తెగ సెర్చ్ చేసేస్తున్నారు. మరి.. అప్పటి పాప, ఇప్పటి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు పూజా హెగ్డే.

Pooja Hegde Childhood Photo 01 minఈ పిక్ పూజా తన బ్రదర్‌తో చిలిపిగా ఫోజిచ్చింది. ఆమె బ్రదర్ ఓ ఫైటర్‌లా ఫోజిస్తే.. ఈమె ముద్దుగా కెమెరా ముందు నిల్చుని ఫోజిచ్చింది. దీంతో.. పూజా చిన్న తనంలో కూడా క్యూట్ గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగునాట స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఈ కాళ్ళ సుందరి ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు.. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’ అనే చిత్రంలో నటిస్తోంది. అటు ఆమె తెలుగులో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’, ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ మూవీస్ రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. మరి.., వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే రానున్న కాలంలో ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.