మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే, ఈ మూవీ నుంచి తమన్ ను తప్పించినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది తమన్ అనే చెప్పాలి. ప్రజెంట్ స్టార్ హీరోల అన్ని చిత్రాలకు సంగీతం అందిస్తూ తన సత్తా చూపిస్తున్నారు. ఆయన సంగీతం అందించిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే .., సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్నచిత్రం ‘గుంటూరు కారం’. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ అయింది. అయితే, ఉన్నట్టుండి ఈ సినిమా నుంచి మూవీ యూనిట్ తమన్ ను తప్పించినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రం ప్రారంభం అయిన నాటి నుంచి మహేష్ బాబు తమన్ వర్క్ పట్ల అంత ఇంట్రెస్ట్ గా లేడని తెలుస్తుంది. ఈ కారణంగానే తమన్ ను ఈ మూవీ నుంచి తప్పించినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇతని స్థానంలో కొత్తగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గానీ, జీవీ ప్రకాష్ ను తీసుకోనున్నట్లు టాక్. ఈ క్రమంలోనే తమన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. వలిచిన అరటి పండును జత చేస్తూ… కొందరు కడుపు మంటతోనే ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ అర్థం వచ్చేలా రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రం నుంచి హీరోయిన్ పూజా హెగ్డేను సైతం తప్పించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అసలు ఈ వార్తల్లో నిజం ఎంత? ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందిస్తుందో లేదో చూడాలి మరి.
Bananas 🍌 are very healthy for tummy Burning’s 😉
Beeewwwwwwww 🤐tats a lovely burps 🤠 pic.twitter.com/i8Tq0N6oXL— thaman S (@MusicThaman) June 19, 2023