రోడ్డుపై కుప్పలుగా రూ.2 వేల నోట్ల కట్టలు.. ఎగబడి ఏరుకున్న జనం!

sahidkapoor bollywood familyman

రోడ్డుపై కుప్పలుగా కుప్పలుగా రూ.2వేల నోట్లు పడిఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న జనాలు దొరికిన కాడికి ఏరుకున్నారు. హమ్మయ్య దీంతో తమ కష్టాలన్ని తీరిపోయాయని సంబరపడ్డారు. ఇంతలోనే అసలు విషయం తెలుసుకుని షాక్‌ తిన్నారు. ఎందుకంటే అవి అసలైన నోట్లు కావు. అచ్చం అలానే ఉన్న నకిలీ నోట్లు. అవి అసలైన నోట్లే అని భ్రమపడేలా ఉన్నాయి ఆ నోట్లు. అందుకే సామన్య జనం ఎగబడి మరీ వాటిని ఏరుకుని ఇంటికి తీసుకెళ్లారు. డబ్బులు కుప్పలుగా దొరుకుతున్నాయి అనే వార్త దావానం వ్యాపించింది.

చాలా మంది నోట్ల కోసం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఎంత దొరికితే అంతా మూటగట్టుకుని వెళ్లారు. చివరికి అవి నకిలీవని తెలిసి ఉసూరుమన్నారు. ఇంతకీ ఆ నోట్లు ఎక్కడివి? ఎక్కడ దొరికాయి అంటే.. ముంబైలోని ఒక ప్రాంతంలో షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఒక వెబ్‌సిరీస్‌లో సీన్‌ అవసరం కోసం నోట్లు రోడ్డుపై పడాలి. వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ కోసం నకిలీ నోట్లను రోడ్డుపై పడేశారు. తీరా షూటింగ్‌ ముగిసిని తర్వాత వాటిని ఎత్తేయకుండా అలానే వదిలేయడంతో అటుగా వెళ్లే స్థానికులు నిజమైన డబ్బులనుకుని ఏరుకున్నారు.