ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన తమ కటుంబంపై వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారని ఇది కరెక్ట్ పద్దతి కాదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే మళ్లీ గనుక అసెంబ్లీలో కాలుపెడితే అది ముఖ్యమంత్రిగానే అంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిని ఆయన నా సతీమణి గురుంచి వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. చంద్రబాబు కంటతడితో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.
దీంతో వెంటనే స్పందించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ దిష్టి బొమ్మలు దహనం చేశారు. అయితే తాజాగా ఇదే వ్యవహారంపై స్పందించాడు సీనియర్ నటుడు మెగా బ్రదర్ నాగబాబు. చంద్రబాబు తమకు ప్రత్యర్థి అయి ఉండొచ్చని… టీడీపీ తమకు ప్రతిపక్షం అయ్యుండొచ్చని… కానీ, చంద్రబాబు వంటి ఒక ఓసీనియర్ నేత ఇలా కన్నీటిపర్యంతం అయిన ఘటన తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని నాగబాబు అన్నారు. ఏపీలో నాయకులు హీనాతిహీనమైన పురుగులుగా నిరూపించుకుంటున్నారని మండిపడ్డారు. ఇక దీంతో పాటు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని, ఏదేమైన ఒకరిని దూషించే హక్కు ఎవరికీ కూడా లేదని నాగబాబు అభిప్రాయడపడ్డాడు.