ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది: నాగచైతన్య

nagachaithanya saidharamtej tollywood

నాగచైతన్య- సమంత విడిపోతున్నట్లు ప్రకటించి సినీ అభిమానులకు షాక్‌ ఇచ్చారు. విడాకుల విషయమై ఒకే సమయంలో ఇద్దరు సోషల్‌ మీడియాలో స్పందించారు. తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం రెండు రోజులు సైలెంట్‌గా ఉన్నారు. విడాకుల ప్రకటన తర్వాత వారి సోషల్‌ మీడియా అకౌంట్లపై అభిమానులు ఒక కన్నేశారు. విడాకుల గురించి ఏ విషయమైనా అభిమానులతో పంచుకుంటారా? అని ఎదురుచూశారు. కానీ చై-సామ్‌ దాని గురించి మాట్లాడలేదు. కాగా నాగచైతన్య మాత్రం విడాకుల ప్రకటన అనంతరం ఇవాళ ఒక ట్వీట్‌ చేశారు. ప్రమాదానికి గురైన సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ తన నూతన చిత్రం రిపబ్లిక్‌ సూపర్‌ హిట్‌ అవ్వడంతో అభిమానులకు ఆస్పత్రి నుంచే థ్యాంక్స్‌ చెప్తు ఆదివారం ఒక పోస్టు చేశారు. దానికి నాగచైతన్య రిప్లే ఇస్తూ నువ్వు కోలుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.