మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్!

Floods In Thirupathi Chranjeevi

గత వారం పది రోజుల నుంచి ఏపీతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో కురుస్తున్న వరుస వర్షాలకు చిగురుటాకుల వణికిపోతున్నాయి. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మరీ ముఖ్యంగా తిరుమలలో కొండ చరియలు విరిగిపడడంతో భక్తులే కాకుండా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి కాస్త ఎమోషనల్ అయ్యారు.

తాజాగా ట్విట్టర్ లో స్పందించిన ఆయన భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలచి వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూత నివ్వాల్సిందిగా కోరుతున్నానని చిరంజీవి ట్విట్టర్ లో తెలిపాడు.