ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చదువుకునే వయసులో ప్రేమా, గీమా అంటూ చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఇంతటితో ఆగక తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో జల్సాలు చేస్తూ చివరికి ఊహించని దారుణాలకు తెగబడుతున్నారు. ఇటీవల ఓ మైనర్ బాలిక ప్రియుడి మోజులో పడి ఏకంగా కన్న తండ్రిని కత్తి పొడిచింది. ఇదిలా ఉంటే తాజాగా 9వ తరగతి బాలిక హాస్టల్ లో చదువుకుంటూ మగబిడ్డకు జన్మనిచ్చింది. వినటానికొ షాకింగ్ గా ఉన్న ఇది నిజం. […]
తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ దావన్ సెంటర్ లో తాజాగా ఇద్దరు జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… శ్రీహరి కోటలోని సతీష్ దావన్ సెంటర్ లో చింతామణి సీఐఎస్ఎఫ్ జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే […]
ఆంధ్రప్రదేశ్ తిరుపతి రుయా ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది సంగతి తెలిసిందే. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలుడు మృతి చెందాడు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని అక్కడి అబులెన్స్ సిబ్బంది ఎవరు రాలేదు. దీంతో ఆ బాలుడి తండ్రి మృతదేహాన్ని బైక్ ఇంటికి తీసుకెళ్లాడు. ఈఘటన అందరిని కలచివేసింది. అక్కడి అబులెన్స్ సిబ్బంది సాగించిన దందాపై వెైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ స్పందించారు. ఈ తిరుపతి రుయాలో జరిగిన ఘటనకు కారణమైన వారిని […]
ఏపి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు నగరి ఎమ్మెల్యే రోజా. ఓ వైపు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో లో జడ్జీగా వ్యవహరిస్తూ.. రాజకీయాలతో బిజీగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా రొటీన్ లైఫ్ నుంచి కొంత విరామం తీసుకున్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారపు సంబరాల వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతాచర్యలు ఎంత కఠినతరం చేసినా ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. లారీని కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన నలుగురిలో ఇద్దరు చిన్నారులు ఉండడం చూపరులను కలచివేసింది. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకునే లోపే ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ […]
గత వారం పది రోజుల నుంచి ఏపీతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో కురుస్తున్న వరుస వర్షాలకు చిగురుటాకుల వణికిపోతున్నాయి. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మరీ ముఖ్యంగా తిరుమలలో కొండ చరియలు విరిగిపడడంతో భక్తులే కాకుండా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి కాస్త ఎమోషనల్ అయ్యారు. తాజాగా ట్విట్టర్ లో స్పందించిన ఆయన భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ […]
శేషాచలం అంటే గుర్తుకువచ్చేది తిరుమల వేంకటేశ్వరస్వామి. శ్రీనివాసుడు కొలువై ఉన్న స్థలం శేషాచలం. అరుదైన జంతువులు, అపరూపమైన వృక్షాలకు నెలవు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎర్రచందనానికి శేషాచలం నిలయం. అలాంటి ప్రాంతంలో ఎప్పుడూ అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా కొండలను కాపాడుకుంటూ వస్తున్నారు. శేషాచల వాసా గోవిందా అంటూ నామస్మరణలను కూడా భక్తులు చేస్తుంటారు. అసలే కరోనా సమయం కావడం జనసంచారం పెద్దగా లేని అటవీ ప్రాంతంలో కావడంతో శేషాచలం అడవిలో కొందరు దుండగులు గుప్తనిధుల […]