మా అన్నయ్య అలాంటి వ్యక్తి కాదు.. నాగబాబు ఎమోషనల్ కామెంట్స్!

‘మా’ ఎన్నికలతో మొదైలన వేడి ఇంకా చల్లారలేదు. పైకి మేమంతా ఒకటే కుటుంబం అంటూ ప్రచారం చేస్తున్నా.. చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ తరఫున గెలిచిన 11 మంది ఈసీ సభ్యులు రాజీనామా చేయడంతో ఆ అరమరికలు కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు మెగా బ్రదర్‌ నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎవరి రాజీనామాను నేను ఆమోందించను అని విష్ణు అంటున్నా కూడా వాళ్లందరూ అలా రాజీనామా చేయడం మొద్ద చర్చకు దారి తీసింది. భవిష్యత్‌లో మా కూడా రెండు కుంపట్లు పెడుతుందా అనే పుకార్లు వినిపించాయి. వాటిపై ప్రకాశ్‌రాజ్‌ క్లారిటీ ఇచ్చాడు. ఆత్మ, పరమాత్మ లాంటివి ఏమీ ఉండవు అని చెప్పాడు.

ఇదీ చదవండి: హీరోయిన్‌ నయనతారకు అరుదైన గౌరవం..

nagababuతాజాగా నాగబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మా సభ్యుడిగా కొనసాగడం లేదని స్పష్టం చేశాడు. ‘జనరల్‌ ఎన్నికల తరహాలోనే మా ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ప్రాంతీయవాదం, కులంతోపాటు, ప్రకాశ్‌రాజ్‌పై వృత్తిపరంగానూ ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినప్పుడు ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా నేను కౌంటర్‌ అటాక్‌ చేశాను. తెలుగువాళ్లకు ప్రాంతీయ వాదం ఉండదు అని నమ్మే వ్యక్తిని. ఇప్పటివరకు మా సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. విశాలహృదయంతో వ్యవహరిస్తారనుకున్నాను. కానీ, ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించడం లేదు. ఇక అసోసియేషన్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఎంతో భావోద్వేగంగా నాగబాబు స్పందించారు. మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దన్నగా ఎవరు వ్యవహరిస్తారు.. చిరంజీవి గారు ఆ స్థానానికి వస్తారా? అని కోరగా.. ‘సినీ పరిశ్రమకు పెద్దగా ఉండాలని అన్నయ్య ఎప్పుడూ అనుకోలేదు. నటులు, ఇతర వ్యక్తులెవరైనా కష్టమని మా ఇంటి తలుపు తడితే ఆయన చేయగలిన సాయం చేసేవాడు. అంతేగానీ పెద్దరాయుడిలా కుర్చీలో కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడూ అనలేదు. ఆయన అంత అహంకారి కూడా కాదు’ అంటూ మెగా బ్రదర్‌ క్లారిటీ ఇచ్చారు. ఇంకో అసోసియేషన్‌ కూడా పెట్టే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు.

మా ఎన్నికల్లో గెలిచిన సభ్యులు ఇలా రాజీనామా చేయడం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.