తెలుగు బుల్లితెర రియాలిటీ షోలలో రీసెంట్ గా ప్రారంభమైన ‘డాన్స్ ఇండియా డాన్స్’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, సితార చీఫ్ గెస్టులుగా మొదలైన ఈ డాన్స్ రియాలిటీ షో.. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తిచేసుకుంది. ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ఈ షో.. ఏడవ ఎపిసోడ్ కి సంబంధించి కొత్తగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. అయితే.. డాన్స్ షో కాబట్టి ఎలాగో సందడి ఉంటుంది. కానీ.. ఈ వారం మా ప్రెసిడెంట్, నటుడు మంచు విష్ణు గెస్ట్ గా వచ్చేసరికి షోలో సందడి రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. ఎప్పుడో కాంట్రవర్సీ వార్తల్లో నిలిచే మంచు విష్ణు.. ఒక్కసారిగా డాన్స్ షోలో కనిపించడం సర్ప్రైజింగ్ గా మారింది.
ఇక తెలుగులో డాన్స్ ఇండియా డాన్స్ షోకి నటి సంగీత, హీరోయిన్ ఆనంది, బాబా భాస్కర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ షోకి అకుల్ బాలాజీ హోస్ట్ కాగా మంచు విష్ణు ఎంట్రీ ఆకట్టుకుంటుంది. స్టేజిపైకి విష్ణు ఎంటర్ అవ్వగానే ‘అన్నొచ్చిండు..’ అనే వాయిస్ తో జిన్నా భాయ్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో స్టైలిష్ గా పోజులిచ్చాడు. త్వరలోనే విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ మూవీ రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విష్ణు డాన్స్ ఇండియా డాన్స్ షోలో అడుగు పెట్టినట్లు తెలుస్తుంది. ఇక షోలోకి వచ్చీరాగానే జబర్దస్త్ రోహిణితో సరదా సంభాషణ కామెడీ తెప్పిస్తుంది.
ఈ క్రమంలో రోహిణి వచ్చి నా పెళ్ళికి మీ టెంట్ హౌస్ నుండే అన్ని కావాలని అడుగుతుంది. వెంటనే విష్ణు స్పందిస్తూ.. నా టెంట్ హౌస్ చేస్తే పెళ్లిళ్లు ఆగిపోతాయి.. నాకన్నా అందగాళ్ళు చాలామంది ఉన్నారని పంచ్ వేస్తాడు. అలాగే ఓ పెర్ఫార్మన్స్ తర్వాత చీర మహత్యం గురించి చెప్పమంటే.. “పబ్లిక్ లో అడిగితే ఎలా.. నా ఫాంటసీస్ చెబితే సెన్సార్ ఒప్పుకోదు” అంటూ ఫన్ క్రియేట్ చేశాడు జిన్నా భాయ్ అలియాస్ మంచు విష్ణు. ప్రస్తుతం డాన్స్ ఇండియా డాన్స్ లో మంచు విష్ణు పాల్గొన్న ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు త్వరలోనే జిన్నా మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నాడు.