ప్రిన్స్ మహేశ్ బాబుతో రొమాన్స్ చేయనున్న సొట్టబుగ్గల సుందరి?

Maheshbabu Lavanya Tripati Trivikram

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. ఈ మూవీ సూపర్ హిట్ కావటంతో ఈ బామకు సినిమా వెంట సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ సుందరి తన అంద చందాలతో ఆకట్టుకోవటంతో ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి భారీ సినిమాలో నటించే అవకాశాన్ని చేజికించుకుంది. ఈ చిత్రం కూడా బంపర్ హిట్ కావటంతో మెల్ల మెల్లగా స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది.

ఇక ఆ తర్వాత గ్లామర్ పాత్రలకు కూడా తగ్గకుండా వచ్చిన సినిమాలను ఒడిసిపట్టుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది ఈ భామ. ఆ తర్వాత వచ్చిన ‘ భలే భలే మగాడివోయ్’, ‘అర్జున్ సురవరం’ సినిమాలు ఆకట్టుకున్నా ఈ మధ్యకాలంలో వచ్చిన చావుకబురు చల్లగా సినిమా మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఈ బామకు ఈ మధ్యకాలంలో ఆఫర్లు కూడా పెద్దగా తలుపు తట్టటం లేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. అందులో మహేష్ బాబు సరసన లావణ్య త్రిపాఠిని మూవీ యూనిట్ ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో త్రివిక్రమ్ మహేష్ బాబు కలయికలో ఖలేజా, అతడు వంటి సినిమాలు చేశారు. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రానుంది. మరి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని నిజంగానే ఎంపిక చేశారా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.