నాన్న‌గారు కోలుకుంటున్నారు..ఆ వార్త‌లు న‌మ్మోద్దు: కైకాల కూతురు

Kaikala Sathyanarayana Tollywood AP

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇక్కడ వార్తని త్వరగా అందచేయాలన్న తొందరలో కొంత మంది నిజ నిర్ధారణ అన్న విషయాన్నే మర్చిపోతున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రెటీల విషయంలో ఇలాంటి తొందరపాటు వార్తలు, ఫేక్ న్యూస్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. తాజాగా.. హాస్పిటల్ లో చికిత్స అందుకుంటున్న లెజండ్రీ యాక్టర్ కైకాల సత్యనారాయణ విషయంలో కూడా ఇప్పుడు ఇలాంటి ఓ ఫేక్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

విల‌క్ష‌ణ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఇటీవ‌ల అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. కానీ.., ఇప్పుడు ఒక్కసారిగా కైకాల స‌త్యనారాయ‌ణ ఆరోగ్య స్థితిపై త‌ప్పుడు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. కైకాల సత్యనారాయణ మృతి చెందిన‌ట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో అంతా తప్పుడు వార్తలను ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో.., ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి స‌త్య‌నారాయ‌ణ కూతురు ర‌మాదేవి రంగంలోకి దిగారు.

“మా నాన్న‌గారి ప‌రిస్థితి బాగానే వుంది. ఆయ‌న కోలుకుంటున్నారు. బాగా స్పందిస్తున్నారు. అంద‌రితో మాట్లాడుతున్నారు. నిన్న డాక్ట‌ర్ మాదాల ర‌విగారు వ‌చ్చారు. ఆయ‌న‌తో కూడా మాట్లాడి థ‌మ్స‌ప్ కూడా చూపించారు. కాబ‌ట్టి..ఆ తప్పుడు వార్తలను నమ్మకండి. ఆయన అభిమానులు ఆందోళ‌న చెందాల్సిన అవసరం లేదని సత్యనారాయణ కూతురు క్లారిటీ ఇచ్చారు.

నిజానికి హాస్పిటల్ లో చేరిన మొదటిరోజు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం కాస్త విషమించిన విషయం వాస్తవమే. కానీ.., తరువాత నుండి ఆయన శరీరం వైద్యానికి సహకరిస్తూ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కూడా కైకాల కోలుకుంటున్నారు అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కైకాల సత్యనారాయణపై ఫేక్ వార్తలు బయట వైరల్ కావడం విచారించతగ్గ విషయం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.