జీవిత త‌మ్ముడే హీరో రాజ‌శేఖ‌ర్‌కి డ్ర‌గ్స్ స‌ప్లై చేశాడు!: జ్యో స్టార్ అధినేతలు

ప్రముఖ సినీ నటులు జీవిత రాజశేఖర్ లు తమకు భారీ ఎత్తున మోసం చేశారని ఆరోపించారు జ్యో స్టార్ అధినేతలు కొటేశ్వరరావు, హేమ. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసం జీవితారాజశేఖర్ దంపతులకు ఆస్తులు  తమ దగ్గర తాకట్టుపెట్టితే రూ.26 కోట్లు ఇచ్చామని..కానీ ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు గరుడవేగ చిత్రం ఆర్థిక విషయాల్లో తాము ఎలాంటి తప్పులు చేయలేదని జీవితా రాజ‌శేఖ‌ర్ ప్రెస్ మీట్ నిర్వ‌హించి తెలిపారు.

image 1 compressed 124దీనిపై జ్యోస్టార్స్ అధినేత‌లు స్పందిస్తూ.. ఇటీవ‌ల జీవితా రాజ‌శేఖ‌ర్ మాపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. అప్పుడు జ్యో స్టార్స్‌కు ఎలాంటి సంబంధాలు లేవని ఇప్పుడు సంబంధం ఉందంటున్నారు. అగ్రిమెంట్ ప్రకారమే మేం అడిగామని.. జీవితా రాజ‌శేఖ‌ర్ సినిమాలో పార్ట్‌న‌ర్స్‌. 75 శాతం జీవిత అయితే.. 25 శాతం మేం. వ‌చ్చిన దానిలో ముందు మేం పెట్టిన పెట్టుబ‌డి తీసుకున్న త‌ర్వాత‌నే మిగిలింది జీవిత తీసుకోవాల‌ని అగ్రిమెంట్‌లో రాసుకున్నాం. ఈ విషయంలోనే జీవిత రాజశేఖర్ దంపతులు మాతో గొడవకు సిద్దమయ్యారని అన్నారు. ఈ విషయంలో పెద్దల సమక్షంలో కూడా కొన్ని ఒప్పందాలు అయ్యాయని.. రూ.26 కోట్ల‌కు చెన్నైలో ప్రాప‌ర్టీ అమ్మి క‌డ‌తాన‌న్న జీవిత.. త‌ర్వాత చెక్కులు ఇచ్చింది. ఇప్పుడు దాని కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుందని అన్నారు.

ఇది చదవండి: ప్రముఖ తమిళ సినీ నిర్మాత అరెస్ట్!

image 0 compressed 129రాజశేఖర్ త‌ల్లిదండ్రుల కోస‌మే మేం ఈ ప్రాజెక్టులోకి అడుగు పెట్టాం. అప్పుడు మమ్ముల్ని ఎంతో గౌరవించిన వాళ్లు ఇప్పుడు మమ్ముల్నే దోషులుగా చూస్తున్నారు. మా లెక్క‌లు మాకుంటాయి. అన్నీ కోర్టులో ఉన్నాయి. భీరం సుధాక‌ర్ రెడ్డికి మాకు ఏ గొడ‌వ‌లు లేవు. మేం ఎక్క‌డైనా ఈ విష‌యం గురించి మాట్లాడుతామన్నారు. ఇక డ్ర‌గ్స్ కోసం మీ ఆయ‌న ఎక్క‌డెక్క‌డికి వెళ్లింది. మీ త‌మ్ముడు మీ ఆయ‌నకి డ్ర‌గ్స్ తెచ్చి ఇచ్చింది. మీ ఆయ‌న యాక్సిడెంట్స్ చేస్తే.. ఆర్టీఓ ఆఫీసుకి నువ్వెళ్లి మ‌న‌సు బాగోలేక చేశాడ‌ని చెప్పిన విష‌యాన్ని బ‌య‌ట‌కు వ‌స్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జ్యో స్టార్ అధినేతలు కొటేశ్వరరావు, హేమ. మేం మ‌హ‌నీయుల‌మ‌ని స‌ర్టిఫికెట్స్ ఇచ్చుకోవాల్సిన అస‌వ‌రం కూడా లేదు అన్నారు. మరి ఈ విషయం పై జీవితా రాజశేఖర్ దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.