పెళ్లి కోసం ఇల్లు కట్టుకుంటున్న ప్రభాస్!

Prabhas Marriage in April

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు డార్లింగ్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌ గా ఎదిగిన డార్లింగ్ ప్ర‌భాస్‌.. ఇంతకాలం పెళ్లి మాటను దాటవేస్తూ వచ్చాడు. నాలుగు పదుల వయసు వచ్చినా ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడూ స్పందించలేదు. ఎన్నో సంద‌ర్భాల్లో హీరోయిన్ అనుష్క‌తో ప్ర‌భాస్ పెళ్లి అంటూ పుకార్లు బ‌లంగా వినిపించాయి.

తర్వాత ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఇంట్లోనే సంబంధాలు చూస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ పెళ్లి అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లి అతి త్వరలోనే జరగబోతుందని సన్నిహిత వర్గాలు మాట్లాడుకుంటున్నాయట. అలాగే ఇటీవల డార్లింగ్ సుమారు 120 కోట్లకు పైగా ఖర్చు పెట్టి హైదరాబాద్ నానక్ రాంగూడ ఏరియాలో 2 ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అక్కడే భారీ లెవెల్ లో ప్రభాస్ కొత్త ఇల్లు నిర్మాణం సాగుతుంది. ఈ కొత్త ఇల్లు ఇంద్ర భవనంలా ఉండబోతుందని, అది పూర్తికాగానే ప్రభాస్ పెళ్లి చేయాలని కృష్ణంరాజు నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.

Prabhas Marriage in April

 

ఇప్పటికే ప్రభాస్ కోసం ఓ అమ్మాయిని కూడా చూసారని, కరోనా పరిస్థితి తగ్గుముఖం పడితే వెంటనే అంగరంగ వైభవంగా పెళ్లి చేసే ఆలోచనలో డార్లింగ్ ఫ్యామిలీ ఉందట. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే జరగనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే రాధేశ్యామ్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. మరి ప్రభాస్ పెళ్లి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.