ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన శృతిహాసన్‌

Sruthi

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఓ వెలుగు వెలుగుతున్న భామ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా మొదట్లో సినిమా రంగాల్లోకి ఎంట్రీ ఇచ్చినా..  అనంతరం తన అందం, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాందించింది. ఇండస్ట్రీలో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య వార్తల్లో బాగా కనిపిస్తుంది. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శృతీ పాపులర్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం శాంతను హజారిక అనే చిత్రకారుడితో పీకల్లోతు ప్రేమలో ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కపుల్ గోల్స్ పేరిట నిర్వహించిన క్విజ్ లో పాల్గొన్నారు. ఆ వీడియోలో వచ్చే పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు అన్న ప్రశ్నకు.. నేను అంటూ శృతిహాసన్ సమాధానం చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్  చేసింది. ఈ ఇద్దరు ఇలా ఇన్ స్టాలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్తో కలిసి ‘సలార్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్‌ ఇచ్చిన సమాధానాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)