ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, ఇటీవల ఈ అమ్మడుకు ఓ నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. అస్సలు వెనక్కి తగ్గకుండా ఈ ముద్దుగుమ్మ ధీటైన సమాధానం ఇచ్చింది.
టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది నటి శృతిహాసన్. కెరీర్ మొదట్లో ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేసుకున్న ఈ అమ్మడు.. తన కష్టాన్ని నమ్మకుని ఆ తర్వాత వరుస హిట్ తో విమర్శకులకు ధీటైన సమాధానం ఇచ్చి నోళ్లు మూయించింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విజయంతో ఈ అమ్మడు కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటి నుంచి గ్యాప్ లేకుండా వరుస సినమాల్లో నటిస్తూ దాదాపు టాలీవుడ్ లో టాప్ హీరోలందరి చిత్రాల్లో నటించి మెప్పించింది.
అయితే, ఈ అమ్మడు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాని విడుదల చేయనున్నామని రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే, ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గానే ఉంటుంది. అయితే, తాజాగా ఈ హీరోయిన్ ను ఓ నెటిజన్ ఊహించని ప్రశ్న అడిగాడు. మీరు మద్యం సేవిస్తారా అంటూ అడిగాడు. అతని ప్రశ్న చూసి శృతిహాసన్ ఒక్కసారిగా షాక్ గురైంది. అస్సలు తప్పించుకోని ఈ హీరోయిన్ నెటిజన్స్ ప్రశ్నకు ధీటైన జవాబు ఇచ్చింది. ” నేను మద్యం సేవించను, డ్రగ్స్ తీసుకోను. జీవితాన్ని హుందాగా గడపడం అంటేనే నాకు ఇష్టం” అంటూ శృతిహాసన్ ఆన్సర్ ఇచ్చింది.