బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమీషా పటేల్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించింది.
తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతోమంది బాలీవుడ్ భామలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ చాలా కొద్దిమంది మాత్రమే మంచి పేరు తెచ్చుకున్నారు. 2000లో హృతిక్ రోషన్ మొదటి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. ఆ తర్వాత వరుస చిత్రాలతో దూసుకు పోయింది. తెలుగు లో కూడా నాలుగు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తాజాగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న సమయంలో తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన ‘నాని’, ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’, బాలకృష్ణతో ‘పరవమీర చక్ర ’మూవీస్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి మళ్లీ తెలుగు తెరపై కనిపించకుండా పోయింది. ప్రస్తుతం సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం.. ‘గదర్ 2’. 1971లో ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ విక్రమ్ భట్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ లో విక్రమ్ భట్‌కి ఎంత గొప్ప పేరు ఉందని అతనితో చనువుగా ఉన్నాను. అదే నా కెరీర్ నాశనానికి పునాది అయ్యింది. ఒక దశాబ్దం పాటు మగవాళ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, అమీషా, విక్రమ్ చాలా ఏళ్ల పాటు డేటీంగ్ లో ఉండి విడిపోయిన విషయం తెలిసిందే. మొదట్లో విక్రమ్ భట్.. నటి సుస్మితా సేన్ తో ప్రేమాయణం నడిపించి బ్రేకప్ చెప్పాడు. 2006 నుంచి అమీషా, విక్రమ్ లు చాలా కాలం పాటు డేటింగ్ చేశారు. గద్దర్ 2 మూవీ ప్రమోషన్స్ సందర్భంగా అమీషా పటేల్.. విక్రమ్ తో సహజీవనం తనపై ఎలాంటి ప్రభావం చూపించిందో తెలిపింది.
‘సినీ పరిశ్రమలో నిజాయితికి ఏ మాత్రం విలువు ఉండదు.. నేను నా జీవితంలో ఎంతో నిజాయితీగా ఉన్నా. నేను ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్మి దగ్గర అవుతానో వారిచేతిలోనే మోసపోతుంటాను. ఒకరకంగా చెప్పాలంటే ఇది నా జీవితంలో పెద్ద గుణపాఠం అని చెప్పొచ్చు’ అని తెలిపింది. పబ్లిక్ గా ఓ వ్యక్తితో సంబంధం ఉండటం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయో తెలిసిందే. నా కెరీర్ పూర్తిగా దెబ్బతిన్నది.. దాదాపు పదమూడేళ్ల వరకు నాకు సినిమాల్లో ఛాన్సులు రాలేదు. అందుకే నా జీవితంలో మరో పురుషుడికి చోటు ఇవ్వలేదు. ఇప్పుడు నేను మనశ్శాంతిని కోరుకుంటున్నా.. ఇంతకంటే ఎక్కువ నా జీవితంలో ఏదీ అక్కర్లేదు అని పేర్కొంది. ఇటీవల అమీషా చెక్ బౌన్స్ కేసు కింద కోర్టులో లోంగిపోయింది. ఆ తర్వాత బెయిల్ పై వచ్చింది.