సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఇంట గణేష్‌ నిమజ్జన వేడుకలు.. వీడియో వైరల్‌

maheshbabu namrata ganeshfestival

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేశారు. కుటుంబసభ్యులతో మహేష్‌ పిల్లలు సితారా, గౌతమ్‌లు పర్యావరణ పరిరక్షణ నియమాలు పాటిస్తూ గణేషుడిని నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి సంబంధించిన ఫోటోలను మహేష్‌బాబు సతీమణి నమ్రత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఎంతో భక్తితో వినాయకుడికి పూజలు చేసి అందరూ కలిసి మట్టి గణపతికి టాటా చెప్పారు.

‘గణేశుడికి వీడ్కోలు ఎప్పుడూ ఉండదు. ఆ దేవ దేవుడి కృప మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ త్వరగా వస్తావని ఆశిస్తున్నాను అంటూ నమ్రత పేర్కొన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం జలవనరులు కాలుష్యానికి కారణం కాకుడదని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మహేశ్‌బాబు, నమ్రత సహజంగానే ప్రకృతి ప్రేమికులు. పర్యావరణాన్ని కాపాడుతూనే పండగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవచ్చని ఘట్టమనేని ఫ్యామిలీ నిరూపించింది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)