వినాయక చవితి వచ్చిందంటే ప్రతీ ఒక్కరూ ఇంట్లో, ఆఫీసుల్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. గీతా ఆర్ట్స్ వారు కూడా తమ ఆఫీస్ లో వినాయకుడ్ని ప్రతిష్టించారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గ్రూపులు వారీగా భక్తులు గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ వారు కూడా తమ గణేశుడిని నిమజ్జనం చేసేందుకు బయలుదేరారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అల్లు అర్జున్ తన కూతురు అర్హతో కలిసి పాల్గొనడం […]
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై హైకోర్టు అమనుతి ఇవ్వకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగంతి తెలిసిందే. కాగా కేవలం ఈ ఏడాదికి మాత్రమే నిమజ్జనానికి అనుమతి ఇస్తున్నట్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాల నిమజ్జనానికి ఇదే చివరి అవకాశం, వచ్చే ఏడాది నుంచి అనుమతించమంటూ సీజేఐ పేర్కొన్నారు.
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేశారు. కుటుంబసభ్యులతో మహేష్ పిల్లలు సితారా, గౌతమ్‌లు పర్యావరణ పరిరక్షణ నియమాలు పాటిస్తూ గణేషుడిని నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి సంబంధించిన ఫోటోలను మహేష్‌బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో భక్తితో వినాయకుడికి పూజలు చేసి అందరూ కలిసి మట్టి గణపతికి టాటా చెప్పారు. ‘గణేశుడికి వీడ్కోలు ఎప్పుడూ ఉండదు. ఆ దేవ దేవుడి కృప మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ త్వరగా […]