హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై హైకోర్టు అమనుతి ఇవ్వకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగంతి తెలిసిందే. కాగా కేవలం ఈ ఏడాదికి మాత్రమే నిమజ్జనానికి అనుమతి ఇస్తున్నట్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాల నిమజ్జనానికి ఇదే చివరి అవకాశం, వచ్చే ఏడాది నుంచి అనుమతించమంటూ సీజేఐ పేర్కొన్నారు.