బిగ్ బాస్-5 లో ‘7 Arts’ సరయు!.. కుర్రాళ్ళకి పండగే!..

బుల్లితెరపై ఎన్ని షోలు ఉన్నా,  బిగ్ బాస్ కార్యక్రమానికి ఉండే ఫాలోయింగ్ వేరు. ఇందులో భాగంగానే బిగ్ బాస్-5 కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్-5 మొదలు కాబోతుంది. ఇక ఇప్పటికే షోకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్-5 లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. యాంకర్ రవి, సిరి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, షణ్ముఖ్, టివి 9 యాంకర్ ప్రత్యూష, పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్-5 కోసం ఓ సూపర్ కంటెస్టెంట్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు ‘7 ఆర్ట్స్’ యూట్యూబ్ ఛానెల్ సరయు.

7 arts Sarayu in Bigg Boss 5 02 minయూట్యూబ్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకి సరయు గురించి పరిచయం అవసరం లేదు. కాస్త అడల్ట్ కంటెంట్ తో, అడల్ట్ పంచ్ లతో సరయు టీమ్ యూట్యూబ్ లో చేసే రచ్చ అంతాఇంత కాదు. వీరు ఏ వీడియో విడుదల చేసిన కొన్ని లక్షల్లో రీచ్ ఉంటుంది. ఈ క్రమంలోనే సరయు తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా యువతలో ఈ అడల్ట్ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం 7 ఆర్ట్స్ సరయు గనుక బిగ్ బాస్-5 లో అడుగు పెడితే ఆమెకి కుర్రకారు కనెక్ట్ అయిపోవడం ఖాయం.

మరి, సరయు బిగ్ బాస్-5 లో విన్నర్ గా నిలుస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.