బిగ్ బాస్ హౌస్ లో తొలిరోజే యాంకర్ రవికి అవమానం.. ఏమైందంటే?

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి రియాలిటీ షోలోని మాజాని పరిచయం చేసిన గేమ్ షో. ఇప్పటి వరకు జరిగిన నాలుగు షోలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 5 లేటెస్ట్ గా స్టార్ట్ అయ్యింది. అయితే.., ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్ లో ఏకంగా 19 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. వీరిలో సినిమా నటుల నుండి.. సీరియల్ నటుల వరకు, బుల్లితెర యాంకర్స్ నుండి మోడల్స్ వరకు అందరూ ఉన్నారు. మిగతా అన్నీ సీజన్స్ తో పోలిస్తే.. ఈసారి కంటెస్టెంట్స్ బాగున్నారన్న పాజిటివ్ టాక్ కూడా వస్తోంది. అయితే.., వీరందరిలో ప్రొఫైల్ పరంగా చూస్తే యాంకర్ రవి కాస్త ఫేవరేట్ అని చెప్పుకోవచ్చు.

రవి ప్రస్తుతం బుల్లితెరపై బిజీ యాంకర్. అయినా..,ఇతను బిగ్ బాస్ కి రావడంతో అంతా ఇతని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మిగతా అందరు కంటెస్టెంట్స్ తో పోలిస్తే.. యాంకర్ రవి రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువే అని తెలుస్తోంది. మరి ఇంత హైప్ ఉన్నప్పుడు ఆడియన్స్ లో రీచ్ కూడా అంతే స్థాయిలో ఉండాలి కదా? కానీ.., ఈ విషయంలో యాంకర్ రవి వెనకపడినట్టు తెలుస్తోంది.

Shanmukh Overtaking Anchor Ravi On Social Media Support -Suman TVబిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లుకు వెల్కమ్ చెప్తూ.., స్టార్ మా ట్విట్టర్ పేజ్‌లో అందరి ఫొటోలను షేర్ చేసింది. ఇందులో నెటిజన్ల నుంచి ఎక్కువ లైకులు, కామెంట్లు, రీట్వీట్లు అందుకున్నది మాత్రం షణ్ముక్ జస్వంత్. యాంకర్ రవి ఈ విషయంలో షణ్ముక్ కి దగ్గరగా కూడా లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక లేడీ కంటెస్టెంట్స్ లో సిరి హన్మంత్ మొదటి స్థానంలో ఉండటం విశేషం. సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న రవికి షణ్ముక్ తో సమానమైన ఫాలోయింగ్ లేదా అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో.. సీనియర్ యాంకర్ కి హౌస్ లోకి వెళ్లిన మొదటి రోజే షాక్ తప్పలేదు. మరి.. యాంకర్ రవి, షణ్ముక్ జస్వంత్ లో ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మీరు భావిస్తున్నారు? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.