బిగ్ బాస్-5 స్టార్ట్ అయ్యే డేట్ వచ్చేసింది!

బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షుకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాలిటీ షో. ఈ షో వచ్చే వరకు తెలుగు ప్రేక్షకులకు రియాలిటీ షో లోని మజా అస్సలు తెలియదు. ఇక షోలో ఉండే కోపాలు, తాపాలు, అలకలు, ఆప్యాయతలు, కష్టాలు, కన్నీరు, అందాలు, ఆనందాలు అన్నీ ఎమోషన్స్ కలగలిపి తెలుగునాట బిగ్ బాస్ ని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. కాగా.., ఇప్పుడు ప్రేక్షకులు 5 వ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 5 వ సీజన్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? హోస్ట్ గా ఈసారి ఎవరు రాబోతున్నారు? కంటెస్టెంట్స్ ఎవరన్న చర్చ అప్పుడే మొదలయింది. నిజానికి బిగ్ బాస్ షో అనేది ఓ నిరంతర పక్రియ. కానీ.., షో జరిగే 100 రోజులే మనకి దాని గురించి తెలుస్తూ ఉంటుంది. కానీ.., ఆ తరువాత నుండే నెక్స్ట్ సీజన్ కోసం నిర్వాహకులు కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసే పనిలో బిజీగా ఉంటారు. అలా ఈసారి కూడా కొంత మంది పార్టిసిపెంట్స్ ని ఇప్పటికే సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. “సాఫ్ట్ వేర్ డెవెలపర్” వెబ్ సీరీస్ తో ఫేమస్ అయిన షణ్ముఖ్, టిక్ టాక్ స్టార్ దీపికా పిల్లి, సీనియర్ యాక్టర్ రాజీవ్ కనకాల, యాంకర్ వర్షిణి, బస్తీ బాయ్స్ టీమ్ నుండి ఒకరు.., సీనియర్ న్యూస్ రీడర్ రోజా, యాంకర్ శివ పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరి కొంత స్టార్స్ కూడా బిగ్ బాస్ 5 లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎప్పటిలానే ఈసారి కూడా అక్కినేని సీనియర్ హీరో కింగ్ నాగార్జున బిగ్ బాస్ 5 కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడట.

బిగ్ బాస్ 5 వ సీజన్ ని ప్రారంభించడానికి కరోనా సెకండ్ వేవ్ అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ 5 త్వరగా స్టార్ట్ చేయాలా? వద్దా? అని నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది షో త్వరగా స్టార్ట్ అవ్వాలనే కోరుకున్నారు. కానీ.., ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నడుమ షో నిర్వహించడమంటే కత్తి మీద సాము లాంటిదే అని చెప్పుకోవచ్చు. పైగా.., ఇందుకోసం ఇప్పుడు లీగల్ గా చాలా ప్రొసీడింగ్స్ అవసరం అవుతాయి. ఈ లెక్కలు అన్నీ దృష్టిలో పెట్టుకునే బిగ్ బాస్ సీజన్ 5 ని ఆగస్ట్ నెలకి మార్చినట్టు సమాచారం. ఇప్పటికే సెలక్ట్ అయిన పార్టిసిపెంట్స్ కి కూడా ఈ విషయాన్ని నిర్వాహకులు తెలియ చేశారట. ఆగస్టు నాటికి కేసులు తగ్గితే.., ముందుగా కంటెస్టెంట్స్ ని క్వారంటైన్‌ లో ఉంచి.., తరువాత షో మొదలు పెట్టనున్నారట. నిజానికి తెలుగు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ని కూడా చాలా క్లిష్ట స్థితిలోనే విజయవంతంగా నిర్వహించారు. ఆ సీజన్ ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిన విషయమే. లాక్‌డౌన్‌లో సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఈ షో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించింది. ఆ సీజన్‌లో ఎక్కువగా కొత్త వారే ఉన్నప్పటికీ నాగార్జున హోస్టింగ్ తో షో ఆసక్తిగా మలచడంలో సక్సెస్ అయ్యారు. మరి ఈసారి కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 5 ని అంతే సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తారేమో చూడాలి.