అల్లు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘పుష్ప’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్స్ కి పండుగ వాతావరణం రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’చిత్రాలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న ‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్‏తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

pushga minసుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం కావడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించారు మేకర్స్. కానీ అనుకున్న విధంగా పనులు పూర్తికాని కారణంగా రిలీజ్ డేట్ విషయంలో అయోమయం నెలకొంది. ఒకదశలో ఈ ఏడాది రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు కూడా కలిగాయి.

pagsjd minమొత్తానికి అన్ని అనుమానాలకు పులిస్టాప్ పెడుతూ.. సినిమా విడుదల విషయంలో స్పష్టత ఇచ్చేందుకు రంగంలోకి దిగిన మేకర్స్ డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ఒక అధికారిక ప్రకటన చేస్తూ రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ వదిలారు. అనుకున్న సమయాని కంటే ముందుకు వచ్చి మరీ అల్లు అర్జున్ బాక్సాఫీస్ ని కొట్టబోతున్నాడు. పుష్ప రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.  మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మద్య రిలీజ్ అయిన రష్మిక ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది.