సలార్: ఒక్క ఛేజింగ్ సీక్వెన్స్ కోసం 20కోట్లా..?

Prabhas

ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం సినీ ప్రపంచమంతా ఈ పేరు మార్మోగుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారిన ప్రశాంత్ నీల్.. తదుపరి సలార్ సినిమాను డార్లింగ్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న సలార్ పై అభిమానులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే.. కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలను లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ కలెక్షన్స్ మాత్రం భీభత్సంగా రాబట్టుకున్నాడు.

ఇప్పుడు ఇదే విషయంపై సినీవర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. లిమిటెడ్ బడ్జెట్ మూవీకే పాన్ ఇండియా స్థాయి కలెక్షన్స్ రాబడితే.. ప్రభాస్ లాంటి హీరోతో భారీ బడ్జెట్ సలార్ మూవీకి అవుట్ ఫుట్ ఏ స్థాయిలో రాబట్టగలడో ఊహించలేము అంటున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సలార్ గురించి ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయలెంట్ యాక్షన్ మూవీ కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.Salarఅందులోనూ ప్రభాస్ లాంటి కటౌట్.. సరిగ్గా వాడుకుంటే బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలవడం ఖాయం. అయితే.. ఈ సినిమాలో భయంకరమైన లోయలో ఛేజింగ్ సీక్వెన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఒక్క ఛేజింగ్ సీక్వెన్స్ కోసమే మేకర్స్ దాదాపు 20కోట్లు ఖర్చు చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ వారు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి సలార్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.