వెయిట్‌ లాస్‌ కు గోధుమ పిండితోనే కాదు.. ఈ పిండితోనూ ట్రై చేయండి..

Wight Loss Diet Foods

ప్రస్తుతం రోజుల్లో ఉద్యోగాల తీరు మారింది. ఎంతో మందికి శారీరక శ్రమ ఉండటం లేదు. కొందరు మాత్రమే అందుకు తగిన వ్యాయామం వైపు అడుగులు వేస్తున్నారు. చాలా మంది శరీరంపై శ్రద్ధ పెట్టడం లేదు. ఫలితంగా ఊబకాయం, పొట్ట వచ్చేస్తున్నాయి. అందుకు కసరత్తులు మొదలు పెట్టేస్తున్నారు. అయితే ఆ తర్వాత ఆప్షన్‌ డైట్‌ ప్లాన్‌. అందులోనూ ఎక్కువ చపాతీకే ప్రిఫరెన్స్‌ ఇస్తారు. అయితే కేవలం గోధుమ పండితో మాత్రమే కాకుండా ఈ పిడులను కూడా ట్రై చేయండి. తప్పకుండా ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు.

జొన్న రొట్టె

Wight Loss Diet Foods

ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అవును గోధుమ పిండి కంటే జొన్న రొట్టతోనే ఎక్కువ ఫలితం ఉంటుంది అంటున్నారు. జొన్నల్లో ఎక్కువగా ప్రొటీన్‌, ఫైబర్‌, క్యాల్షియం, ఐరన్‌ ఉంటాయి. గతంలో అయితే వీటిని తయారు చేయడం చాలా కష్టమని దూరం పెట్టేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బయట కూడా ఎంతో సులువుగా జొన్న రొట్టెలు దొరుకుతున్నాయి.

రాగి పిండి

Wight Loss Diet Foods

రాగి పిండి కూడా ఎంతో చక్కని ఫలితాన్ని ఇస్తుంది. రాగి పిండి కూడా గ్లూటెన్‌ ఫ్రీ. రాగి పిండిలో ఫైబర్‌, అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. రాగి పిండిని వాడటం వల్ల ఎంతో త్వరగా కడుపు నిండిపోయిన ఫీలింగ్‌ వస్తుంది. బరువు తగ్గే ప్రక్రియను ఎంతో వేగంగా చేస్తుంది.

సజ్జలు(బాజ్రా)

మన తాత, ముత్తాతలు వాడిన ఆహారపు అలవాట్లే ఎంతో శ్రేష్టమైనవి అనేందుకు ఇది మరొక ఉదాహరణ. సజ్జలు కూడా వెయిట్‌ లాస్‌ ఎంతో సహకరిస్తాయి. సజ్జలు కూడా గ్లూటెన్‌ ఫ్రీ. ఇందులో ప్రోటీన్‌, ఐరన్‌, మ్యాగ్నీసియం, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. మీ బరువు తగ్గేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఓట్స్‌ పిండి

Wight Loss Diet Foods

హెల్దీ డైట్‌, వెయిట్‌ లాస్‌ అనగానే ఇప్పుడు అందరి చూపు ఓట్స్‌ వైపే. అయితే అది కూడా చక్కని ఆప్షన్‌. ఇది వెయిట్‌ లాస్‌ కే కాదు.. షుగర్‌ ను అదుపు చేసేందుకు ఎంతో సహకరిస్తాయి. వీటిలో సోల్యూబుల్‌ ఫైబర్‌, ఇన్‌ సోల్యూబుల్‌ ఫైబర్స్ ఉంటాయి. ఇవి మీకు ఎక్కువ సమయం పాటు ఆకలి కలగకుండా కంట్రోల్‌ చేస్తాయి.

బాదం పిండి

Wight Loss Diet Foods

బరువు తగ్గడమే కాదు.. శక్తివంతంగా ఉండాలంటే బాదం పిండి మంచి ఆప్షన్‌ అనే చెప్పవచ్చు. ఇందులో విటమిన్‌ ఏ, మెగ్నీషియం, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. అంతేకాదు.. ఇందులో ఇంకో మంచి సౌకర్యం ఏంటంటే ఇందులో సోడియం ఉండదు. దీన్ని తినడం వల్ల శరీరంలో చక్కెర ఎక్కువగా పెరగదని నిపుణులు తెలిపారు. అంటే వెయిట్‌ కూడా పెరిగే ఆస్కారం తక్కువగా ఉంటుంది.

ఇవండి గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా మీరు ట్రై చేయదగిన పిండులు. ఎప్పుడూ ఒకే పిండిని కాకుండా.. ఇలా డిఫరెంట్‌ గా కూడా ట్రై చేయండి. మీకు ఆరోగ్యంతో పాటు కాస్త ఛేంజ్‌ కూడా ఉంటుంది.