మాగీ, నూడుల్స్, కిట్‌కాట్ చాక్లెట్, నెస్‌కాఫ్ – ఇవన్నీ చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు నెస్లే. అయితే ప్రపంచంలోనే ఆహార ఉత్పత్తుల కంపెనీల్లో అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా గుర్తింపుపొందిన ఈ కంపెనీ తయారుచేసిన ఉత్పత్తుల్లో 60 శాతానికి పైగా అనారోగ్యకరమైనవేనట. ఆస్ట్రేలియా హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్ ప్రకారం అయితే మొత్తం ఫుట్ మరియు డ్రింక్స్ పోర్ట్ఫోలియో చూస్తుంటే 70 శాతం ప్రొడక్ట్స్ ఆరోగ్యంగా లేనట్లు తేలింది. 90% బెవరేజెస్, కాఫీ మినహాయింపు మిగిలినవన్నీ కూడా ఆరోగ్యంగా లేనట్టు తేలింది. ఈ ఉత్పత్తుల తయారీలో ఎన్ని మార్పులు చేసినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పురాదట. కంపెనీ అంతర్గత నివేదిక ఆధారంగా ఈ విషయం తెలిసినట్టు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
అంతర్గత నివేదిక నేపథ్యంలో పుష్టికరమైన, ఆరోగ్యకరమైన వ్యూహాలను తయారుచేయడం ద్వారా ‘అనారోగ్యకర’ సమస్య నుంచి బయటపడేందు కు ప్రయత్నిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. తమ ఉత్పత్తులు ఇకపై మ రింత రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండేలా తయారుచేస్తామని పేర్కొంది. పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) స్వచ్చంద సంస్థపై నిషేధం విధించాలని అమూల్ వైఎస్ చైర్మన్ వలామ్జీ హుంబల్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. యూకే బిజినెస్ డైలీ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం టాప్ ఎగ్జిక్యూటివ్ తో జరిగిన ప్రజెంటేషన్ లో 37 శాతం నెస్లీ ప్రొడక్ట్స్ పెట్ ప్రొడక్ట్స్ మినహాయించి అనారోగ్యకరంగా ఉన్నాయని తేలింది. ఇతర మెడికల్ న్యూట్రిషన్ మినహాయించి ప్రొడక్ట్స్ 3.6 రేటింగ్ తో ఉన్నాయని చెప్పడం జరిగింది.