థర్డ్ వేవ్ నుండి పిల్లలని కాపాడుకోవడానికి 10 చిట్కాలు!

కరోనా సెకండ్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపించింది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త అదుపులోకి వస్తోంది. ముఖ్యంగా చాలా రోజుల తరువాత రోజువారీ కేసులు లక్ష కన్నా తక్కువ నమోదు అవ్వడం విశేషం. అన్నీ రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతోనే ఇది సాధ్యం అయ్యింది. అయితే.., కరోనా సమస్య ఇక్కడితో పూర్తిగా పోయినట్టు కాదు. ముఖ్యంగా థర్డ్ వేవ్ ముప్పు ఎలానో పొంచే ఉంది. అయితే.. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై ఎక్కువగా ఉంటుందని కొంతమంది వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ.. కేంద్రం మాత్రం అలాంటి సంకేతాలు ఏవి లేవని.., కరోనాకి పర్టికులర్ ఏజ్ గ్రూప్ టార్గెట్ అనేదే లేదని స్పష్టం చేసింది. కానీ.., థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదమే అన్న చర్చకి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ నుండి పిల్లలను కాపాడుకోవడానికి చేయాల్సిన 10 పనులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1) ఒక వయసు వచ్చిన పిల్లలని రోజూ గంటైనా ఎండలో ఆడుకోనివండి. తిరగనివ్వండి. ఈ సమయంలో మాస్క్ లు వాడుతూ.., తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంతేగాని వారికి పూర్తిగా సూర్య కాంతిని దూరం చేయకండి.

2) బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. పిలల్లకి ఇచ్చే పాలల్లో చక్కెరకి బోదులు బెల్లం వేయండి. అలాగే.., నువ్వులు, బెల్లం ఉండలు, వేరుశనగ చిక్కీలు పెట్టండి.

3) ఇదే సమయంలో మొలకలు, పండ్లు, మజ్జిగ, రాగిజావ, ఎక్కువగా ఇవ్వండి. ఇవి శరీరంలో నీటి శాతం గణనీయంగా పెంచుతాయి.

3d 24) కొంతకాలం జంక్ ఫుడ్ కి పిల్లలను దూరంగా ఉంచండి. ఆకుకూరలు… కూరగాయలు ఎక్కువగా తినిపించండి. అన్నంలో తప్పనిసరిగా నెయ్యి కలిపి పెట్టండి.

5) ఏదైనా పల్లెటూరుకి తీసుకెళ్లి అక్కడ మంచి మట్టిలో కొన్ని రోజులు ఆడుకునేలా చేయండి. ఇమ్యునిటీ దానంతట అదే పెరుగుతుంది. పిల్లలకి ఎలాగో వ్యాక్సిన్ లేదు కాబట్టి ఇదే మంచి చర్య.

6) ఎట్టి పరిస్థితిల్లోను పిల్లలకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఇవ్వకండి. వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అన్నీ పోషకాలు వారికీ ఆహరం ద్వారానే అందేలా చూసుకోండి.

7) ముఖ్యంగా సెల్ ఫోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనలో చాలా మంది పిల్లలకి ఫోన్స్ ఇస్తుంటాము. కానీ.., వాటిని మాత్రం శానిటైజ్ చేయడం మర్చిపోతుంటాము. కాబట్టి.., మీ ఫోన్స్ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం మరచిపోవద్దు.

8) మీ పిల్లలకి కనుక స్కూల్స్ తీస్తే ఒక్కరోజు వీలు చూసుకుని మీరు కూడా వారితో పాటు స్కూల్స్ కి వెళ్లి చూడండి. పాఠశాల యాజమాన్యం కోవిడ్ నిబంధనలు ఏమైనా పాటించకపోతే అధికారులకు కంప్లైంట్ చేయండి.

9) చాలా మంది పిల్లలు 5 వ ఏటకే చెప్పిన విషయాలను అర్ధం చేసుకోగల సామర్ధ్యం కలిగి ఉంటారు. అలాంటి వారికి చేతులను నోటిలో,, కంటిలో, ముక్కులో పెట్టుకోకూడని చెప్పండి. బయటకి వెళ్ళినప్పుడు మాస్క్ అవసరాన్ని వివరించండి. వారు అర్ధం చేసుకుంటే సగం శ్రమ తప్పినట్టే.

10) వారానికో సారి పిల్లల చేత పొద్దున్నే నాలుగు వేపాకులు తినిపించండి. అప్పుడప్పుడు నిమ్మరసం తాగించండి. నేల ఉసిరి కాయలు తినిపించండి.

ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ వల్ల ఒకవేళ పిల్లలకి ప్రమాదం ఉన్నా.., వారిలో మహమ్మారిని తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.