దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాలలో కేసులు ఇంకా అదుపులోకి రావడం లేదు. దేశ వ్యాప్తంగా గతంలో కంటే పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు అవుతున్నా.., మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో ప్రజలు అందరికీ డాక్టర్స్ మాత్రమే దిక్కు. కానీ.., కొన్ని రాష్ట్రాల్లో సమస్యలు ఏర్పడడంతో జూ.వైద్యులు సమ్మె బాట పడుతున్నారు. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల మంది జూనియర్ వైద్యులు ఉద్యోగాలకు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఇక్కడి రాష్ట్రంలో జూనియర్ వైద్యులు సమ్మె చేపడుతున్నారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. 24 గంటల్లో విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల సమ్మె చేయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. దీనిపై జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కూడా అంతే తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పని చేస్తున్న దాదాపు మూడు వేల మంది జూనియర్ వైద్యులు తమ పోస్టులకు రాజీనా చేశారు. ఆయా కాలేజీల డీన్ లకు సమర్పించినట్లు మధ్యప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ మీనా వెల్లడించారు.
డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. కరోనా వైరస్ సోకితే…తమకు, తమ కుటుంబాలకు స్టయిఫండ్ పెంచాలని, ఉచిత చికిత్స అందించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. కష్ట కాలంలో మా ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ సర్వీస్ చేస్తున్నాము. అయినా.., మా కష్టానికి సరైన గుర్తింపు దక్కడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వవాన్ని చాలాసార్లు అభ్యర్ధించాము. అయినా.. వారి నుండి సరైన స్పందన లేదు. ఇందుకే అందరం కలసి ఈ మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నట్టు జూనియర్ వైద్యులు తెలియచేస్తున్నారు. మరోవైపు న్యాయస్థానం కూడా ఈ విషయంలో సంచలన కామెంట్స్ చేసింది. ఇది డిమాండ్స్ నెరవేర్చుకునే సమయం కాదు. బాధ్యతగా మెలగాల్సిన సమయం. కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్న ఈ దశలో డాక్టర్స్ రాజీనామా ఏంటి? త్వరలో సాధారణ పరిస్థితిలు నెలకొనకపోతే కఠిన ఆదేశాలు జరీ చేస్తామని న్యాయమూర్తి తెలియచేశారు. మరి.., తరువాత కాలంలో ఈ జూనియర్ వైద్యులు సమ్మె ఎలాంటి పరిణామాలకి కారణం అవుతుందో చూడాలి.