‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ తొలి కెప్టెన్‌గా ‘సిరి హన్మంత్’

bigg boss siri

‘బిగ్‌బాస్‌ 5 తెలుగు’ మూడు ఎపిసోడ్లకే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రతి ప్రోమో, ఎపిసోడ్‌ ఒకదానికి మించి ఒకటి అన్నట్లు ఉంటున్నాయి. తాజా సీజన్‌లో పరిచయం చేసిన పవర్‌ రూమ్‌ కాన్సెప్ట్‌ అందరినీ అలరిస్తోంది. విశ్వ తన పవర్స్‌తో యాంకర్‌ రవి, నటి ప్రియలకు వింత టాస్క్‌ ఇచ్చాడు. ఇద్దరూ ఆపోసిట్‌ జెండర్‌ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. తర్వాత మానస్‌, ఆర్జే కాజల్‌కు ఇచ్చిన టాస్క్‌ ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. హౌస్‌లో సభ్యులు అందరూ పడుకున్నాకే పడుకోవాలి అనగా.. లహరి కావాలనే నిద్రపోకుండా ఉండిపోయింది. ఇలా ప్రతి టాస్క్‌ కూడా చాలా ఇంట్రస్టింగ్‌ సాగుతోంది. వీటన్నింటి కంటే మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. బిగ్‌ బాస్‌ హౌస్‌లో తొలి కెప్టెన్‌ ఎవరు కాబోతున్నారు అన్నదే అందరి ప్రశ్న. ఎందుకు కంగారు దానికి సమాధానం మేం చెప్తాం కదా.

biggboss siriఇప్పటికే కెప్టెన్‌ లేక ఇంట్లో ఎన్నో గొడవలు కూడా జరుగుతున్నాయి. కిచెన్‌ డిపార్ట్‌మెంట్‌ కానివ్వండి, హౌస్‌ క్లీనింగ్‌ విషయాల్లో కానివ్వండి సభ్యుల మధ్య సమన్వయం లోపిస్తోంది. ఇంటి సభ్యులంతా కెప్టెన్‌ ఒకరు ఉంటే ఈ సమస్యలు రాకుండా ఉంటాయని భావిస్తున్న విషయం తెలిసిందే. మరి, ఆ కెప్టెన్‌ ఎవరో కాదు.. మాకు అందిన విశ్వసనీయ సమాచారంతో ‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ సీజన్‌లో తొలి కెప్టెన్‌గా ‘సిరి హన్మంత్‌’ కాబోతోంది. అవునండి ‘సిరి హన్మంత్‌’నే ఫస్ట్‌ కెప్టెన్‌. మరి, అందుకు సిరి ఎదుర్కొన్న ఛాలెంజ్‌ ఏంటి.. ఎవరిని ఓడించి తను కెప్టెన్‌ అయ్యింది అన్న విషయాలు తెలియాలంటే రాబోయే ఎపిసోడ్లు చూడాల్సిందే.