‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో రోజులు గడుస్తున్న కొద్దీ రచ్చ మాములుగా ఉండటం లేదు. యానీ మాస్టర్ ఎలిమినేషన్ తర్వాత సింగర్ శ్రీరామచంద్ర కాజల్, సన్నీ, యానీ మాస్టర్ పై ఫుల్ ఫైర్ అవుతున్నాడు. ప్రతి రీజన్ కు వారితో గొడవకు కాలు దువ్వుతున్నాడు. మరోవైపు సింగర్ శ్రీరామ్ కు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అంతే పెరుగుతోంది. అతను మాట్లడేది చాలా కరెక్ట్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు. శ్రీరామ్ చాలా జెన్యూన్ గా ఉంటున్నాడు అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. మొన్నటి వరకు టాప్-5 అనుకున్న శ్రీరామ్ గ్రాఫ్ ఇప్పుడు ఇంకా పెరిగింది.
బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు చేసిన 24 గంటల పనులను కుదించి.. ఎడిట్ రీ ఎడిట్లు చేసి ప్రేక్షకులకు ఒక గంట చూపిస్తారు. అయితే ఆ గంట స్లాట్ లోనూ సింగర్ శ్రీరామ్ కే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోందనే భావన వినిపిస్తోంది. అతను ఎక్కువ కంటెంట్ ఇస్తున్నాడా? లేక బిగ్ బాస్ శ్రీరారమచంద్రకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. గత నాలుగు రోజుల నుంచి రోజూ వచ్చే ప్రోమోల్లోనూ శ్రీరామ చంద్రనే ఎక్కువ హైలెట్ అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. మరి బిగ్ బాస్ ఏమైనా శ్రీరామ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇవ్వన్నీ కాలుక్యులేట్ చేసుకుని కొందరు ఇప్పటికే ఫిక్స్ అయిపోతున్నారు.. బిగ్ బాస్ కూడా శ్రీరామ్ పార్టీకి మారాడు. ఇంక బిగ్ బాస్ విన్నర్ సింగర్ శ్రీరామచంద్రనే అంటూ ప్రచారాలు మొదలు పెట్టారు. అయితే శ్రీరామ్ బిగ్ బాస్ జర్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి నాలుగు వారాలు అసలు ఇంట్లో ఉన్నాడా? అనుకున్న శ్రీరామ్ ఇప్పుడు బిగ్ బాస్ అంతా శ్రీరామచంద్రనే అన్నట్లుగా ఉంది. అతని గేమ్ ఎలా మార్చుకుంటూ వచ్చాడో అలాగే అతని ఫ్యాన్ బేస్, గ్రాఫ్ కూడా మారుతూ వచ్చింది.
గతంలో గూగుల్ పొరపాటున బిగ్ బాస్ 5 తెలుగు విన్నర్ సింగర్ శ్రీరామ చంద్ర అని చూపించినప్పుడు అందరూ ట్రోల్ చేశారు. కానీ, ఇప్పుడు అతని ఫాలోయింగ్ చూస్తుంటే అదే నిజం అయ్యేటట్లు కనిపిస్తోంది. అప్పుడు గూగుల్ కూడా మేము ముందే చెప్పాం అని మళ్లీ ప్రచారం చేసుకుంటారేమో చూడాలి.