కన్నీటి పర్యంతమవుతున్న హౌస్‌ మేట్స్‌.. అసలు కారణం అదే!

biggboss

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ రోజుకో మలుపు, పూటకో ట్విస్టులతో దూసుకుపోతోంది. ఎంటర్‌టైన్మెంట్‌ పక్కా అన్న రేంజ్‌లో నడుస్తోంది బిగ్‌ బాస్‌ తెలుగు. సోమవారం నామినేషన్స్‌తో హీటెక్కిన హౌస్‌ ఇంకా చల్లబడలేదు. మళ్లీ కన్నీటి కథలు మొదలయ్యాయి. అసలు రంగులు ఇప్పుడే తెలుస్తున్నాయంటూ ఒకరినొకరు నిందించుకుంటున్నారు. సవాళ్లు, ఆరోపణలు దాటిపోయి విమర్శల్లోకి దిగారు. దోస్త్‌ అనుకున్నవాళ్లే దుషమ్మన్‌గా మారుతున్నారు.

నటి ఉమాదేవిలో చాలా మార్పు కనిపిస్తోంది. పిలిచినా కూడా గొడవ పడేలా ఉంది. ఎందుకు అంటే నేనింతే.. ఇలానే ఉంటానంటూ వాదిస్తోంది. మంచి చెప్పబోతున్నా కూడా వినేపరిస్థితుల్లో కనిపించట్లేదు. మరోవైపు శ్వేత వర్మ ఇంకా కూల్‌ కాలేదు. సిల్లీ కారణాలతో నామినేట్‌ చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంటోంది. బిగ్‌ బాస్‌లో నామినేషన్‌ కారణాలు ఒక్కోసారి చాలా అంటే చాలా సిల్లీగా ఉంటాయి. అలాంటివి చూస్తే ప్రేక్షకులకు కూడా ఏంటి ఆ రీజన్‌ అనిపిస్తుంది. మానస్‌ ఏమో లోబో అలా ఎందుకు మాట్లాడాడో తెలుసుకునే పనిలో పడ్డాడు. నామినేషన్‌ తర్వాత ప్రతిసారి కనిపించే సన్నివేశాలే మళ్లీ కనిపిస్తున్నాయి.

ravi biggbossనటరాజ్‌ మాస్టర్‌ చెప్పిన ఆ గుంట నక్క యాంకర్‌ రవినా? అది నిజమే అయితే రవి అలా ఎందుకు చేస్తాడు. రవి ఇప్పటికీ నాకు రెస్పెక్ట్‌ ఇస్తున్నాడు అన్న మాటలు ఎందుకు మారాయి?. ‘నేను అందరికి ఎక్కిస్తున్నానని మీ దగ్గర ప్రూఫ్‌ ఉందా? అని రవి అడిగిన ప్రశ్నను చూస్తే నటరాజ్‌ మాస్టర్‌ ఆ ఆరోపణలు చేసింది రవి గురించేనా అనే అనుమానం వస్తుంది. మరోవైపు రవికి లోబో రూపంలో ఇంకో సమస్య మొదలైంది. దగడ్‌ లోబోతో రవికి కష్టాలు తప్పేలా లేవు. అప్పటివరకు ఎవరెవరో పేర్లు చెప్పి.. చివరికి నన్ను చేస్తున్నాడు అని రవి వాపోతున్నాడు. లోబో కూడా అసలు గేమ్‌లోకి దిగాడు అని అర్థమవుతోంది. బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ నుంచి బెస్ట్‌ గేమర్‌గా మారాలని లోబో భావిస్తున్టలు తెలుస్తోంది. నామినేషన్స్‌లో లోబో మాటలు చూస్తే అలాగే అనిపిస్తోంది.

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ లేటెస్టు అప్‌డేట్స్‌, నామినేషన్స్‌, ఎలిమినేషన్స్‌, గాసిప్స్‌ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్‌ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తూ ఉండండి.