యానీ మాస్టర్, షణ్ముఖ్ ను ఇమిటేట్ చేస్తూ నాగార్జున పంచ్ లు

biggboss5 promo

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ మోస్ట్ ఎంటర్‌టైనింగ్‌, బిగ్గెస్ట్‌ రియాలిటీ షో.. తెలుగులో చాలా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అప్పుడే ఐదు రోజులు పూర్తి చేసుకుంది. హౌస్‌లో హీట్‌ పెరిగిపోయింది. గత సీజన్ల కంటే ఈసారి ఎమోషన్స్‌ను పండించడంలో కంటెస్టెంట్‌లు బాగా సక్సెస్‌ అవుతున్నారు. బాధ, స్నేహం, ఆనందం, కన్నీటి పర్యంతం ఈ అంశాలు హౌస్‌లో బాగా కనిపిస్తున్నాయి. శనివారం కావడంతో హోస్ట్‌ కింగ్‌ నాగార్జున ఎంట్రీ ఇచ్చేశాడు. వారం జరిగిందంతా ఒకెత్తు.. కింగ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఒకెత్తు అనమాట. ఆ వారం మొత్తం జరిగిన అంశాలన్నీ పరిశీలిస్తూ మెచ్చుకోవడం, మొట్టికాయలు వేయడం చేస్తుంటాడు కింగ్‌ నాగార్జున. హోస్ట్‌గా అతను చేయాల్సిన పని అదే. ఆ క్రమంలో నాగార్జున ఆయన స్టైల్‌లో వేసే పంచ్‌లు, చేసే అనాలసిస్‌ చాలా కొత్తగా ఉంటుంది.

ఈ వారం కింగ్‌ ఎంట్రీ ప్రోమో అప్పుడే తెగ వైరల్‌ అవుతోంది. గ్రీకువీరుడిలా నలుగురు అమ్మాయిలతో స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. కింగ్‌ నాగ్‌ హౌస్‌మేట్స్‌కి బాగా క్లాస్‌ పీకుతాడని ఎదురుచూసిన అభిమానులకు చుక్కెదురే అని చెప్పాలి. నాగ్‌ చాలా సరదాగా.. కంటెస్టెంట్లను అలరిస్తూ కనిపించాడు. ముందుగా బిగ్‌ బాస్‌ 5 తెలుగు మొదటు కెప్టెన్‌ సిరి హన్మంత్‌ను అభినందించిన నాగ్‌.. సన్నీ కూడా అలాంటి పట్టుదల చూపించాలంటూ కౌంటర్‌ ఇచ్చాడు. సింగర్‌ శ్రీరామ్‌ చంద్రను నాగార్జున ప్రత్యేకంగా పొగిడాడు. నీలో ఈ టాలెంట్‌ ఉందని అనుకోలేదు అన్నాడు. అది ఎందుకని తెలియక పోయినా.. అందరి అంచనా ప్రకారం. లాన్‌లో మూడీగా కూర్చున్న హమీదాకు నాలుగు మంచి మాటలు చెప్పాడు శ్రీరామచంద్ర. కచ్చితంగా నాగార్జున ఆ విషయం గురించే పొగిడినట్లు తెలుస్తోంది. ఏవో ట్రాకులు నడుస్తున్నట్లు నటి ప్రియ చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది.

biggboss5 promoహౌస్‌లో బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా నాగార్జున లోబోను కొనియాడాడు. హౌస్‌లో చాలా ఎంటర్‌టైన్‌ చేస్తన్నావు అంటు చెప్పుకొచ్చాడు. యానీ మాస్టర్‌ను ఇమిటేట్‌ చేసి నాగ్‌ ఆకట్టుకున్నాడు. లహరిని చూసి హౌస్‌లో ఎవరో ఒకరికి ఆ పువ్వు ఇవ్వాలన్నాడు. అందుకు ఎవరో ఒకర్ని పంపాలంటూ లహరి కోరింది. నేనున్నానంటూ లోబో మధ్యలో లేస్తాడు. అందుకు నటి ఉమా నేనేమైపోతానంటూ ప్రశ్నిస్తుంది. ‘అరె ఏంట్రా ఇది’ షణ్ముక్‌ను నాగ్‌ ఆటపట్టిస్తాడు. వారం కావొస్తంది.. కాస్త కనిపిస్తూ ఉండూ అంటూ ఆడుకుంటాడు. మొత్తంగా ఈ వారం నాగార్జున ఎపిసోడ్స్‌ చాలా అంటే చాలా వినోదాన్ని పంచనున్నాయి. ఇక ఎలిమినేషన్స్‌కు సంబంధించి మోడల్‌ జెస్సీ, హమీదా ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. లవ్‌ ట్రాక్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయితే హమీదా సేవ్‌ అయ్యే అవకాశం ఉంది.

ఈ వారం నామినేషన్స్‌లో ఆర్జే కాజల్‌, మానస్‌, యాంకర్‌ రవి, సరయు, జెస్సీ, హమీదా ఉన్న విషయం తెలిసిందే.