లోబోకి ఏమైంది.. ఎందుకంత ఫ్రస్ట్రేషన్.. కారణం అదేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చూసిన వాళ్ళందరికీ మొదటి వారం నుంచి మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్న లోబో ఈ మద్య బాగా ఫ్ర స్టేషన్ కి గురి అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తుండే లోబోకు ఏమైంది? ఎందుకు ప్రతిసారి ఏమోషన్ అవుతున్నారు.. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.. ఇంటి సభ్యులపై తన కోపాన్ని ప్రదర్శిస్తూ.. అంతలోనే సైలెంట్ అవుతున్నాడు? అన్న అనుమానాలు బిగ్ బాస్ చూసేవాళ్లందరికి కలుగుతుంది.

lgadowejనిన్న సోమవారం ఎపిసోడ్ లో ప్రియను టార్గెట్ చేయడం, చిన్న విషయానికి ఆమెపైకి అరుస్తూ, కొట్టడానికే అన్నట్టుగా మీద మీదకు వెళ్ళడంతో గట్టిగా అరవడం చాలామందిని షాక్ కు గురిచేసింది. అది చూసే వాళ్లకే కాదు.. ఇంటి సభ్యులకు కూడా మైండ్ బ్లాక్ అనిపించింది. లోబో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక హౌస్ మేట్స్ సైతం అవాక్కయ్యారు. అయితే లోబో తన లవ్ స్టోరీ చెబుతుంటే.. ప్రియ దాన్ని లైట్ గా తీసుకోవొచ్చు.. లేదా వేరే ఏదైనా కామెంట్ చేసి ఉండొచ్చు.. అందుకు హర్ట్ అయ్యి ప్రియను లోబో నామినేట్ చేయడంలో కూడా తప్పులేదు. కానీ నిన్నటి ఏపిసోడ్ లో మాత్రం అంత లోబో భయంకరంగా సీన్ క్రియేట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. గత కొన్ని రోజులుగా లోబో ప్రవర్తనలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. దానికి కారణాలు అతని ఆరోగ్యం కొంత సహకరించడం లేదు.. బాగా సిగరెట్లు తాగే లోబో కొన్ని రోజులుగా ఆ విషయంలో నియంత్రణ పాటించడం.. వీక్ ఎండ్ లో నాగార్జున వచ్చి ప్రతిసారీ సిగరెట్ ప్రస్థావన తీసుకురావడంతో కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు చేయడం.

logabdoఒక్కసారిగా స్మోకింగ్ కు లోబో దూరం కావడంతో ఆ ఫ్రెస్ట్రేషన్ అంతా అతను తోటి ఇంటి సభ్యుల మీద చూపిస్తున్నాడేమో అనే భావన కలుగుతోంది. ఆ మద్య షణ్ముఖ్ తో డిస్కషన్ పెట్టిన లోబో హౌస్ లో చాలా మంది నన్ను తీసి పడేస్తారు.. జోకర్ అంటారు.. లఫంగ్ అంటారు.. అన్నీ తీసుకుంటున్నా కదా.. అబ్బాయిలను ఏమైనా అనొచ్చు.. అమ్మాయిలను అంటే మాత్రం తప్పు.. అమ్మాయిలు చేసేది మాత్రం తప్పు కాదు.. కొన్ని విషయాలు లైట్ తీసుకోవాలని.. ఇది ఎక్కడి న్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

logbabdఅదీ కాక ఈ మద్య లోబోకి తన కుటుంబం పదే పదే గుర్తుకు రావడం.. ఒక్కసారే ఎమోషన్ కావడం చూస్తూనే ఉన్నాం. నిన్నటి ఎపిసోడ్ లో ఇటు ప్రియను కానీ అటు సిరిని కానీ లోబో నామినేట్ చేయడానికి చెప్పిన కారణాలు గొప్పగా లేదు. అలా లోబో అందరిలో చులకన అయిపోవడమే కాకుండా… ఆ తర్వాత అతన్ని కొందరు ఇదే కారణంగా నామినేట్ చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఏదేమైనా లోబో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని, తనను తాను సరిదిద్దుకుంటే బిగ్ బాస్ లో నెట్టుకొని వస్తాడని.. లేదంటే ఎలిమినేషన్ గ్యారెంటీ అని అంటున్నారు ప్రేక్షకులు.