ప్రియా ఇంట ‘బిగ్ బాస్-5 తెలుగు’ కంటెస్టెంట్ల సందడి..

priya sarayu jessie

ప్రియా అంటే అక్కగా, అమ్మగా, వదినగా తెలుగు వారికి పరియమైన వ్యక్తి. సినిమాలతో పాటు సీరియల్స్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రియ. బిగ్ బాస్ షో తో తనను ఇంకో స్థాయికి పెంచుకుంది. అయితే ఈ నెల 21న ప్రియా ఇంట్లో ఆమె అక్క కూతురు లోహిత వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్-5 తెలుగులోని తన సహచరులను ఆహ్వానించింది. ఆ పెళ్లి వేడుకలో ఇప్పటి వరకు ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు ఆకర్షణగా నిలిచారు. ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇన్‌ స్టాలో వైరల్‌ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by £0{-}!t{-}@👑 (@lohi.79)

ప్రియ బిగ్‌ బాస్ షో నుంచి తిరిగి వచ్చాక.. ఆమె క్రేజ్ ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి. వ్యక్తిగా ప్రియ ఏంటనేది జనాలు చూశారు. ఆమె నటనకు ఎంత ఫిదా.. అయ్యారో ఆమె వ్యక్తిత్వాన్ని కూడా అంతే మెచ్చుకుంటున్నారు. కెప్టెన్‌ కాలేరని తెలిసినా చిరునవ్వుతో ఆ నిర్ణయాన్ని స్వాగతించి ఎందరో మనసులను గెలిచారు. చివరకు ప్రియా ఐదో వారం కెప్టెన్‌ గా అవతరించింది. అంత సాఫీగా జరుతున్న సమయంలో సన్నీతో వైరం కొని తెచ్చుకుని అతడి మీద నోరు పారేసుకోవడంతో కొంత నెగెటివిటీని మూటగట్టుకుంది. ఫలితంగా ఓట్లు తగ్గి ఏడో వారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది.

 

View this post on Instagram

 

A post shared by £0{-}!t{-}@👑 (@lohi.79)

 

View this post on Instagram

 

A post shared by Priya (@priyaartist)