ఉమ తూ.. చిల్లర్‌ అంటూ యానీ మాస్టర్ చిందులు

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ రానురాను రసవత్తరంగా, ఉత్కంఠబరితంగా సాగుతోంది. మొన్నటి దాకా పవర్‌ రూమ్‌ పవర్స్‌తో హంగామా, డ్రామా సృష్టించిన హౌస్‌ మేటస్‌ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌తో చిందులు తొక్కుతున్నారు. ఒక్కొక్కరు రెడ్‌ బుల్‌ తాగినట్లు రెచ్చిపోతున్నారు. నేరుగా బాహాబాహీకి కూడా దిగుతున్నారు. ఓ యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది హౌస్‌లో. ‘పంతం నీదా నాదా’ అన్న టైటిల్‌కు తగ్గట్లు అందరూ వీరంగం సృష్టిస్తున్నారు. నిన్నటి దాకా మాటలు, బూతులతో సరిపెట్టుకున్న ఇంట్లోని సభ్యులు.. ఇప్పుడు తూ.. చిల్లర అనుకునే స్థాయికి, కాళ్లతో తన్నుకునే దాకా వచ్చేశారు. రెండోవారంలోనే ఈ రేంజ్‌లో ఉంటే మిగిలిన రోజుల్లో బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఇంకా ఏం చూస్తామో అంటూ బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి.. ఒకింత బెరుకు కూడా మొదలయ్యాయి.

గత కొద్ది రోజులుగా యానీ మాస్టర్‌, నటి ఉమకు మధ్య గట్టిగానే వివాదాలు నడుస్తున్నాయి. నామినేషన్‌ రోజు అవి బాగా తెలిశాయి. కెప్టెన్సీ టాస్క్‌లో అవి తారస్థాయికి చేరాయి. ఎంత వరకు అంటే ఒకరిని ఒకరు కొట్టుకుని తూ.. చిల్లర నువ్వు అని యానీ మాస్టర్‌ అనడం. అందుకు తిరిగి ఉమ మళ్లీ తూ అంటూ ఆ మేము చిల్లర అయితే.. మీరు క్లాస్‌ నుంచి వచ్చారు మరి అంటూ బదులివ్వడం జరిగింది. పరిస్థితులు చూస్తుంటే హద్దులు మీరినట్లే తెలుస్తోంది. వారి భాషపై బిగ్‌ బాస్‌ నుంచి హెచ్చరికలు రాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ ప్రేక్షకులు అంటున్నారు.

swetha biggbossమరోవైపు శ్వేత కూడా ఏదో విధంగా వివాదాల్లో కనిపిస్తోంది. తాజాగా శ్వేత సిరిని గుద్దడం కూడా వివాదంగా మారింది. కెప్టెన్సీ టాస్క్‌లో శ్వేతను కాళ్లతో తన్నారు. అందుకు కెమెరా దగ్గరకు వచ్చి ఇలా కొట్టించుకోవడానికి కాదు అంటూ సీరియస్‌ అయ్యింది. ఐ హెట్‌ దిస్‌ గేమ్‌ అంటూ ఆగ్రహావేశాలకు గురైంది. మొత్తానికి బిగ్‌ బాస్‌ ఎందుకు స్పందించడం లేదు అన్నదే అందరిలో వినిపిస్తున్న ప్రశ్న.

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ లేటెస్టు అప్‌డేట్స్‌, గాసిప్స్‌, ఎలిమినేషన్స్‌ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్‌ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.