Viral Video: దేవుడి సృష్టిలో మనిషి జీవించటానికి ఎంత హక్కుందో.. మనిషితో పాటు సమానంగా జీవించే హక్కు అన్ని జీవులకు ఉంది. కానీ, కొంతమంది మనుషులు తమ స్వార్థంతో.. సైకో చేష్టలతో ఇతర జీవుల్ని హింసిస్తూ ఉంటారు. వాటికి ఇబ్బంది కలిగించే పనులే చేస్తుంటారు. మరికొందరు ఇందుకు భిన్నంగా సాటి జీవులపై ప్రేమను కలిగి ఉంటారు. వాటికి హాని కలిగే పనులు అస్సలు చెయ్యరు. అవి ప్రమాదంలో ఉంటే తమ వంతు సహాయం చేస్తారు. తాజాగా, ఓ జంతు ప్రేమికుడు ప్రమాదంలో ఉన్న కుక్కను కాపాడ్డానికి పెళ్లిని కూడా పక్కన పెట్టాడు. దాన్ని ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం తన పెళ్లి వేడుకల్లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ టైంలో పెళ్లి జరుగుతున్న ప్రాంతంలోని నది వద్ద ఓ కుక్క ప్రాణాపాయ స్థితిలో ఉందని అతడికి తెలిసింది.
అంతే! మరి కొద్దిసేపట్లో పెళ్లి ఉందని కూడా పట్టించుకోకుండా కుక్క దగ్గరకు వెళ్లాడు. ఆ కుక్క గోడ పక్కన నీటిలో బిక్కుబిక్కుమంటూ కనిపించింది. తన పెళ్లి కోటు తీసి పక్కన పెట్టి రంగంలోకి దిగాడు. గోడపై పడుకుని కిందున్న దాన్ని ఎడమ చేత్తో పైకి లేపే ప్రయత్నం చేశాడు. అయితే, అది అతడికి అందలేదు. కొంత సేపు ప్రయత్నించాడు. కానీ, అతడి వల్లకాలేదు. కొద్దిసేపటి తర్వాత మరో వ్యక్తి అతడికి సహాయం చేయటానికి అక్కడికి వచ్చాడు. అతడు వరుడి కాళ్లు పట్టుకోగా.. వరుడు కుక్కను పైకి తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. పెళ్లి కుమారుడి మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bengaluru: బాయ్‌ఫ్రెండ్ కోసం రోడ్డు మీద జుట్టు పట్టుకుని కొట్టుకున్న గర్ల్ స్టూడెంట్స్!