వాగులో కొట్టుకుపోతున్న ఎద్దు.. ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు.. వీడియో వైరల్‌

bull ap

ప్రాణ మంటే ఎవరికి తీపి ఉండదు? అపాయం వస్తే ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని మనిషి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. మనిషి అంటే నోరుంది.. తన బాధ చెప్పుకోగలడు. అదే మూగజీవాలయితే ఏం చేస్తాయి? ఎవరో ఒకరు చేయందించేవరకు అవి అలా ఉండిపోవాల్సిందే. ఎవరూ అటు రాకపోతే వాటి ప్రాణాలు పోవాల్సిందే. అలా పొరపాటున వాగులో పడిన ఓ ఎద్దును ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు స్థానికులు. ఏపీలో నీళ్లు తాగేందుకు వాగులోకి దిగిన ఎద్దు.. నీళ్లు వేగంగా పారుతుండటంతో ఎద్దు ప్రవాహంలో కొట్టుకుపోయింది. అక్కడే గట్టు మీదున్న స్థానికులు ఎద్దు కొట్టుకుపోవడం గమనించి తాళ్ల సాయంతో ఎద్దును కాపాడేందుకు ప్రయత్నించారు. ముగ్గురు వ్యక్తులు ఎద్దుతోపాటు ఈదుకుంటూ వెళ్లి దానిని పట్టుకుని దానికి తాడు కట్టారు. తాడు సాయంతో అతి కష్టం మీద ప్రాణాలకు తెగించి ఆ ఎద్దు ప్రాణాన్ని కాపాడారు. ఈ వీడియో చూసిన అందరూ వారిని మెచ్చుకుంటున్నారు. ఆ వైరల్‌ వీడియోని మీరు చూసేయండి మరి.