వలసజీవికి వచ్చిన వినూత్న ఆలోచన సూపర్‌! వీడియో వైరల్‌

Normal Person Making bike Different - Suman TV

‘అవసరం అన్ని నేర్పుతుంది’ అని పెద్దలు ఊరికే అనలేదు. చాలామంది తమకు ఎదురైన కష్టాల నుంచే కొత్త దారులను వెత్కుంటారు. చదువు లేకున్నా తమకున్న తెలివితో మేధావులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తుంటారు. కొందరు అక్కర్లేని వస్తువులతో వినుత్నమైన ఆవిష్కరణలు చేస్తారు. తాజా ఓ వ్యక్తి బైక్‌ను ఉపయోగించి సృష్టించిన వాహనం సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతుంది. ద్విచక్ర వాహనానికి ముందు పెద్ద స్టాండ్‌కు రెండు ఉయ్యాలలు ఏర్పాటు చేశాడు. దానికి నాలుగు చక్రాలు అమర్చి బైక్‌ ముందు చక్రం తీసేసి స్టాండ్‌ను బింగించాడు. పేరులేని ఈ కొత్త ఇన్నోవేషన్‌తో జాతీయ రహదారిపై తన కుటుంబతో వెళ్తుండగా కారులో వెళ్తున్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

ఒక చేత్తో బైక్‌ను మరో చేత్తో ఉయ్యాల స్టీరింగ్‌ను పట్టుకుని డ్రైవ్ చేయడం అబ్బురపరుస్తోంది. అసలు దీన్ని ఎలా తయారు చేసాడని వీడియో చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. సిద్దేష్ స్వాంత్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశాడు. దీనికి ‘మా సొంత వలస ఇంజనీర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశాడు. కాగా ఆ వీడియో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తీసిందిగా తెలుస్తుంది. ఆ సామాన్యుడి టాలెంట్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వస్తున్నాయి. ఆ వలసజీవి అద్భుత ఆవిష్కరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.