Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు అంటే.. ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్ షూట్స్‌గా మారిపోయాయి. ఎవరికి తోచినట్లు వాళ్లు వెడ్డింగ్ షూట్స్ నిర్వహిస్తున్నారు. నీటిలో, గాల్లో, కొండల్లో, మంచులో ఇలా.. ప్రత్యేకంగా ఉంటుంది అని అనుకున్న చోటల్లా ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఓ అమ్మాయి మాత్రం ఇందుకు భిన్నంగా మరో అడుగు ముందుకు వేసింది. పెళ్లికి ముందు దిగే ఫోటోలను జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ తీసుకుంది. జిమ్‌లోకి వెళ్లిన సదరు వధువు వివిధ రకాల వర్కవుట్స్ చేసింది. వాటిని ఫొటోలు, వీడియో తీయించుకుంది. ఇది జరిగి దాదాపు సంవత్సరం పైనే అవుతోంది.
అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఆ వీడియో మరోసారి వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.. ‘‘ ఆమె ముందుగానే అత్తామామలకు వార్నింగ్ ఇస్తున్నట్లు ఉంది’’.. ‘‘ ఏ ఇంటికి కోడలుగా వెళుతుందో కానీ, అత్తా,మామలు జాగ్రత్తగా ఉండాలి’’.. ‘‘ నేను కూడా ప్రతిరోజూ వ్యాయమం చేస్తా 2 నుంచి 3 గంటలు’’..‘‘ పెళ్ళి పోటోలు దారి తప్పు తున్నాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Noida Twin Towers: బ్రేకింగ్ : నేలకూలిన నోయిడా ట్విన్ టవర్స్.. వీడియో వైరల్!