సఫారీలో సరదాగా తిరుగుతూ.. కనిపించిన పక్షులను, జంతువులను ఫోటోలు తీయడమంటే చాలా మందికి సరదా. అయితే కొన్ని సార్లు కథ అడ్డం తిరిగితే వన్య ప్రాణాలు దాడి చేస్తాయి. అప్రమత్తంగా లేకపోతే ప్రాణాపాయం కూడా సంభవించొచ్చు. అలాంటి ఘటనో ఒకటి చోటుచేసుకుంది.
చాలా మందికి అడవుల్లో యాత్ర చేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అలానే అడవుల్లో ప్రయాణించే సమయంలో ఆ చుట్టూ ఉండే అందాలను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు. ఇలా సాగే సఫారీ జర్నీ అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అకస్మాత్తుగా వన్య మృగాలు పర్యాటకుల వాహనం పై దాడి చేస్తుంటాయి. మృగాల దాడిలో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయాల పాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. సఫారీకి వెళ్లిన కొందరు పర్యాటకులు ఖడ్గ మృగాలను ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా అవి వారిపై దాడికి యత్నించాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో మనం చూసినట్లయితే.. ఓ సఫారీ వ్యాన్ లో వెళ్తున్న పర్యాటకులకు ఖడ్గమృగాల గుంపు ఎదురైంది. ఆ పర్యాటకులు వాటిని చూస్తూ తెగ సంబర పడిపోయారు. అంతేకాక ఖడ్గ మృగాలను ఫోటోలు తీసేందుకు ఎంతో సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే యాత్రికులను చూసిన ఖడ్గమృగాలు దాడికి యత్నించాయి. దీంతో డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వెనక్కి పోనిచ్చాడు. అవి కూడా వారి వాహనాన్ని వెంబడించాయి. ఈక్రమంలో ఓ ఖడ్గమృగం వీరి వాహనాన్ని కొమ్ముతో ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన వాహనం పల్టీ కొట్టి రహదారి పక్కన పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్విటర్ లో పోస్టు చేశారు.
అంతేకాక “ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ఆపద వాటిల్లలేదు సంతోషంమే. అయితే అన్ని సమయాల్లో అదృష్టం ఉండకపోవచ్చు” అంటూ ఆయన రాసుకొచ్చారు. ఫారెస్ట్ అధికారి పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోపై ఓ రేంజ్ లో కామెంట్స్ వస్తున్నాయి. వైల్డ్ లైఫ్ సఫారీల్లో పర్యటిస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియో చెబుతుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అడవి జంతువుల స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. ఆత్మరక్షణ లేకుండా ముందుకెళ్లొద్దు. మరి.. వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This one showcases what all are wrong in our wildlife Safaris…
Respect the privacy of wild animals. Safety of self comes first.
I am informed that both Rhino & tourists are safe. All will not be that lucky . pic.twitter.com/p1kEAQdyjN— Susanta Nanda (@susantananda3) February 25, 2023