viral video: దేవుడి సృష్టి.. ఆయన లీలలు ఎంతో అద్భుతంగా ఊహకు అందనివిగా ఉంటాయి. ముఖ్యంగా చావు బతుకుల విషయంలో దేవుడి సృష్టి ఊహాతీతం. ఒక్కోసారి చీమ కుట్టిన వ్యక్తి చనిపోతాడు… ఇంకోసారి 50 కత్తిపోట్లు తిన్న వ్యక్తి బతుకుతాడు. ఇలా చాలా చాలా వింతలు దేవుడి సృష్టిలో జరుగుతూ ఉంటాయి. అలాంటిదే అర్జేంటీనాలో జరిగిన ఈ ఘటన. ఈ ఘటనలో ఓ యువతి ఉన్నట్టుండి రైలు కిందపడింది. ప్రాణాలు పోతాయని అందరూ అనుకున్నారు. స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. వివరాల్లోకి వెళితే.. అర్జేంటీనాలోని బ్యూనో ఎయిర్స్‌కు చెందిన క్యాండెల్లా కొద్దిరోజుల క్రితం అక్కడి ఇండిపెండెన్స్ స్టేషన్‌కు వెళ్లింది. రైలు కోసం ఎదురుచూస్తూ ఉంది. ఓ రైలు పక్కనే ఉన్న పట్టాలపై వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఉన్నట్టుండి తూళుతూ రైలు బోగీల మధ్య ఉన్న ఖాళీ సందులో పడింది. ఆ వెంటనే రైలు పెట్టే తగిలి.. కిందకు పడింది. అలా రైలు కిందపడిపోయింది.
ఈ సంఘటనను చూసిన జనం ఒక్కసారిగా షాక్ తిన్నారు. రైలు ఆగిన తర్వాత ఓ వ్యక్తి ఆమెను బయటకు లాగాడు. అయితే, ఆమె ప్రాణాలతోనే ఉందని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అక్కడకు చేరుకున్న అంబులెన్స్ ఆమెను అక్కడినుంచి ఆసుపత్రికి తరలించింది. డాక్టర్లు ప్రాథమిక వైద్యం చేసి ఇంటికి పంపేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను ఇంకా ఎలా బతికి ఉన్నానో తెలియటం లేదు. ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే గుర్తుకు తెచ్చుకుంటున్నా. సడెన్‌గా నా బ్లడ్ ప్రెషర్ తగ్గటంతో తూళుతూ కిందపడ్డాను. నా ముందున్న వ్యక్తితో దీని గురించి చెప్పటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇలా జరిగింది. తర్వాత ఏం అయిందో నాకు గుర్తులేదు. నేను రైలుకు కొట్టుకోవటం వరకు మాత్రమే గుర్తుంది’’ అని చెప్పిందామె. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
So this happened recently in #BuenosAires #Argentina
This woman apparently fainted and she fell under on an oncoming train, BUT SHE SURVIVED! She’s now out of the hospital 🙏 pic.twitter.com/EQA2V4foh9
— Diamond Lou®™ 🔞 (@DiamondLouX) April 19, 2022
ఇవి కూడా చదవండి : మీదనుంచి ట్రైన్ పోయినా భయపల్లేదు.. ఫోన్‌లో చిట్‌చాట్..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.