Viral Video: యూట్యూబ్ స్టార్స్ కొందరు లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి మరీ వీడియోలు చేస్తున్నారు. పెద్ద పెద్ద భవనాలు, కొండలు ఎక్కి వాటి అంచుల మీద నిలబడి ఫొటోలు దిగటం వంటివి చాలానే చూశాం. ఇలాంటివి చేస్తున్నపుడు ప్రాణాలు పోగొట్టుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా.. అలా చేయటం చట్టా రీత్యా నేరం అని తెలిసినా యూట్యూబ్ స్టార్స్ కొందరు ఆ పని చేయటం మానటం లేదు. తాజాగా, ఓ ముగ్గురు వ్యక్తులు ఏకంగా వందల అడుగుల ఎత్తైన క్రేన్ ఎక్కి సెల్ఫీ వీడియో తీశారు. ప్రాణాలకు తెగించి మరీ విన్యాసాలు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు యూట్యూబ్ స్టార్స్ గోల్డ్ కోస్ట్‌లోని అత్యంత ఎత్తైన క్రేన్ పైకి ఎక్కారు. దాని ఎత్తు దాదాపు 250 మీటర్లు.
అలాంటి దాని మీదకు ఎక్కి సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. ఓ వ్యక్తి ఓ అడుగు ముందుకు వేసి ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేశాడు. అవి చూస్తున్న వాళ్లను సైతం భయపెట్టేలా ఉన్నాయి. ఏ మాత్రం పట్టుతప్పినా ఎముకలు కూడా దొరకవని వారికి కూడా తెలుసు. వీరిలో ఒకరి భుజానికి గాయం కావటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు యూ ట్యూబర్స్ తమ ముఖాలు కనిపించకుండా బ్లర్ చేసి వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలోని వ్యక్తులు గనుక పోలీసులకు దొరికితే వారికి లక్షల్లో ఫైన్, ఓ సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వైరల్: విదేశీ యువతితో ఫొటోలకు ఎగబడ్డ యువకులు.. మీద చెయ్యి వేసి మరీ..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.