Viral Video: ఇంటర్ నెట్ పుణ్యమా అని ఎక్కడెక్కడో.. ప్రపంచం నలుమూలలా జరుగుతున్న వింతలు, విశేషాలను ఇంట్లో కూర్చుని చూడగలుగుతున్నాం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటి ఉధృతి పెరిగింది. ఎక్కడో జరిగిన ఓ సంఘటన మనకు నిమిషాల్లో తెలిసిపోతోంది. వీడియోలు, ఫొటోలు, వార్తల రూపంలో చూడగలుగుతున్నాం. అవి వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తాజాగా, ఓ తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ ప్రమాదానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని వ్యక్తి అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌లా నిలిచాడు. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి చేతిలో గొడుగుతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఓ చోట షాపులోకి వెళ్లడానికి రోడ్డు దాటాడు.
రోడ్డు పక్కనే ఉన్న కాలువపై నిర్మించిన స్లాబుపై కొన్ని అడుగులు వేశాడు. అంతే! ఆ స్లాబు ఉన్నట్టుండి కృంగింది. పెళ్లున కాల్వ లోపలికి పడిపోయింది. అతడు వెంటనే పక్కకు తప్పించుకున్నాడు. ఓ అడుగు ఆలస్యంగా వేసుంటే మాత్రం గొయ్యిలో పడిపోయేవాడు. ఓ వింత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి అతడు దాన్ని చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత షాపులోని వారు బయటకు వచ్చారు. ఎందుకలా జరిగిందో చర్చించుకోసాగారు.
ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ అదృష్టం అంటే ఇతడిదే..’’.. ‘‘నువ్వే దాన్ని పగుల గొట్టావు.. కాబట్టి నువ్వే డబ్బులు చెల్లించాలి’’.. ‘‘ఈ వీడియో చూడగానే నా ఒళ్లు జలదరించింది. భయమేసింది’.. ‘‘ దేశంలోనే అత్యంత ధృడమైన వ్యక్తి’’ .. ‘‘ యమధర్మ రాజు లంచ్ బ్రేక్‌లో ఉన్నట్టున్నాడు’’ అంటూ కామెంట్లు చేశారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: ఈసారి పేదల కోసం ఫ్రీ 5స్టార్ హోటల్ ఓపెన్ చేసిన హర్షసాయి!