Viral Video: న్యూస్ యాంకరింగ్ అంటే సాధారణ విషయం కాదు. ఏ వార్తనైనా ఒకే భావంతో చెప్పాల్సి వస్తుంది. చెప్పటమే కాదు.. కొన్ని సార్లు మన వ్యక్తిగత విషయాలను, విషాదాలను పక్కన పెట్టి మరీ యాంకరింగ్ చేయాల్సి ఉంటుంది. అదే ఓ నిజమైన యాంకర్ తన వృత్తికి ఇచ్చే విలువ. తాజాగా, ఓ యాంకర్ జర్నలిజం విలువలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారు. ఆమె వార్తలు చదువుతున్నపుడు నోట్లోకి ఈగ దూరినా వార్తలు చదవటం ఆపలేదు. ఈ సంఘటన కెనడాలో చోటుచేసుకుంది. వివరాలు.. కెనడాకు చెందని ప్రముఖ న్యూస్ యాంకర్ ఫరా నాసర్ కొద్దిరోజుల క్రితం లైవ్‌లో న్యూస్ చదువుతున్నారు.
పాకిస్తాన్ వరదలకు సంబంధించిన ఆ న్యూస్‌ను చదువుతున్నపుడు ఓ ఈగ టక్కున ఆమె నోట్లోకి దూరింది. న్యూస్ మధ్యలో ఈగ నోట్లోకి దూరటంతో ఆమె ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే, దాన్ని ముఖంలో కనపడనివ్వలేదు. వార్తలు చదవటం ఆపలేదు. వెంటనే ఆ ఈగను మింగేశారు. వార్తలు చదవటం కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఈగ కనిపించలేదు. ఆమె తడబటం మాత్రమే ఉంది. దీంతో అందరూ ఆమెపై కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఫరా నాసర్ స్పందించారు.
ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వీడియోను షేర్ చేశారు. ఈగ తన నోట్లోకి వెళ్లటం కారణంగానే అలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ తర్వాత ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంఘటనపై మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ న్యూస్ చదవటానికి ముందు ఓ ఈగ అక్కడ చక్కర్లు కొట్టడం నేను చూశా. నేను మనసులో వద్దు నా దగ్గరికి రావద్దు అని అనుకుంటూనే ఉన్నాను. నన్ను ఇబ్బంది పెట్టొద్దని అనుకుంటూ ఉన్నాను. కానీ, అలా జరిగిపోయింది’’ అని చెప్పకొచ్చారు. మరి, వార్తలు చదువుతుండగా యాంకర్ నోట్లోకి ఈగ దూరటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sharing because we all need a laugh these days. Turns out it’s not just @fordnation, I swallowed a fly on air today.
(Very much a first world problem given the story I’m introducing). pic.twitter.com/Qx5YyAeQed
— Farah Nasser (@FarahNasser) August 29, 2022
ఇవి కూడా చదవండి : కుక్క పళ్లు క్లీన్ చేయించటానికి రూ. 5 లక్షలు ఖర్చు చేసిన యజమాని