సాధారణంగా ఓ మనిషి ముక్కు ఎంత పొడవు ఉంటుంది? రెండు ఇంచులు లేదా మూడు ఇంచులు ఉంటుంది. ఇంతకంటే కొంచెం పొడవుగా ఉన్నా అదో రికార్డు అవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు కలిగిన వ్కక్తిగా టర్కీకి చెందిన మహమత్ ఒజిరెక్ మీద ఓ గిన్నిస్ రికార్డు ఉంది. అతడి ముక్కు ఏకంగా 3. 46 ఇంచులు ఉంది. వంశపారపర్యంగా పెద్ద ముక్కు తమ కుటుంబంలోని వారికి వస్తోందని మహత్ తెలిపాడు. తన తండ్రి, బాబాయ్‌లకు కూడా అంత పెద్ద ముక్కు ఉందని అతడు అన్నాడు. అయితే, ప్రపంచ రికార్డు ఇతడికి సొంతం అవ్వడానికి దాదాపు మూడు వందల ఏళ్ల క్రితమే ఓ వ్యక్తిపై చెరిగిపోని రికార్డు ఉంది. అతడి ముక్కు ఈ సృష్టిలో ఎవరికీ లేనంత పొడవుగా ఉండేది.
మూడు ఇంచులు, నాలుగు ఇంచులు కాదు.. ఏకంగా ఏడు ఇంచులపైనే. 1730లో ఇంగ్లాండ్‌లోని యాక్షేర్లో జన్మించిన థామస్ వెడ్డర్ అనే వ్యక్తి ముక్కు 7.5 ఇంచులు ఉండేది. 18వ శతాబ్ధంలో అతడు పలు సర్కస్ కంపెనీలలో పని చేసేవాడు. అతడు తన ముక్కుతో కూడా శృంగారంలో పాల్గొనేవాడన్న ప్రచారం కూడా ఉంది. దాదాపు 250 ఏళ్లుగా… చనిపోయినా కూడా ఆయన ఆ రికార్డును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫేమస్. ఆయన మైనపు విగ్రహాలు చాలా మ్యూజియాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. థామస్ వెడ్డర్ గురించి కొత్తగా తెలుసుకుంటున్న వ్యక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద ముక్కేంటిరా బాబు అంటున్నారు.